Smartphones under 20000: 20 వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారి ముందున్న బెస్టు ఆప్షన్స్ ఇవే
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:23 PM
రూ.20 వేల లోపు ధరల్లో అద్భుత ఫీచర్స్ ఉండే ఫోన్ కొనాలనుకుంటున్నారా? మరి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్‌లు అంటే కేవలం కమ్యూనికేషన్ సాధనాలు మాత్రమే కాదు. వీటితో ఎన్నో పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, మార్కెట్‌లో అనేక స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉండటంతో తమ అవసరాలకు తగ్గట్టు అందుబాటు ధరల్లో ఏ ఫోన్ కొనాలనేదానిపై జనాల్లో కొంత తికమక సహజం. మరి రూ.20 వేల లోపు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
మొబైల్‌ను ఎక్కువగా వినియోగించే వారికి మోటో జీ85 5జీ అత్యంత ఉపయుక్తమైన ఫోన్. అల్ట్రా ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ప్రీమియం లుక్స్ ఉన్న ఈ ఫోన్‌లో 50ఎంపీ ఓఐఎస్ సోనీ ఎల్‌వైటీఐఏ 600 కెమెరా, 33వాట్ టర్బోపవర్ ఛార్జింగ్, 3డి కర్వ్డ్ పీఓఎల్ఈడీ 120హెర్జ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5, 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉన్నాయి.
బడ్జెట్‌కు లోబడి అద్భుత డిజైన్‌తో ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి శామ్‌సంగ్ గ్యాలెక్సీ ఏ05 ఓ మంచి ఆప్షన్. ఇందులో డ్యూయల్ సిమ్ టెక్నాలజీ, ఫోన్ వినియోగాన్ని బట్టి లభించే వర్చువల్ ర్యామ్, 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లు ఉన్నాయి. అయితే, కంపాస్, జైరోస్కోప్ సెన్సర్లు మాత్రం లేవు.
మీ బడ్జెట్‌కు లోబడి వేగవంతమైన పర్‌ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్‌గా ఒప్పో కే13ఎక్స్ 5జీకి పేరుంది. దీంట్లో 5జీ సపోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్, అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్, 550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ మాత్రం ఇందులో లేదు.
మిడ్ రేంజ్‌లో అద్భుతమైన ఫీచర్లతో వచ్చే మరో ఫోన్ వీవో టీ4ఎక్స్ 5జీ. ఇందులో 6500ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్లస్ 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.72 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి, 120హెర్జ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7300 5జీ చిప్‌సెట్, ఐపీ64 ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ బిల్డ్, 50ఎంపీ ఏఐ కెమెరా, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. బ్లోట్ వేర్ ఇబ్బందీ కాస్త ఉన్నదని కూడా కొందరు చెబుతారు. మరి వీటిల్లో మీకు నచ్చినది ఎంచుకుని కొనుక్కోండి.
ఇవి కూడా చదవండి:
అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సముద్రంలోనే ఎందుకు దిగుతారో తెలుసా..?
పవర్ బ్యాంక్ కొనాలనుకునేవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి
Read Latest and Technology News