ChatGPTs Insightful Guide: షార్ట్‌కట్‌లో కోటీశ్వరుడు అవ్వడం ఎలా?.. చాట్‌జీపీటీ సూపర్ రిప్లై
ABN , Publish Date - Jul 13 , 2025 | 08:00 AM
ChatGPTs Insightful Guide: తక్కువ కాలంలో కోట్లు ఎలా సంపాదించాలో చెప్పమని ఓ వ్యక్తి చాట్‌జీపీటీని అడిగాడు. అంది ఏం చేయాలో.. ఎలా చేయాలో వివరించి మరీ చెప్పింది. అది చెప్పింది చేస్తే కోటీశ్వరులు కావటం పక్కా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతీ రంగంలో ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా చాట్‌జీపీటీ మనిషి నేస్తంగా మారింది. ఎక్కువ శాతం మంది గూగుల్ వాడకాన్ని తగ్గించేసి, చాట్‌జీపీటీ వాడుతున్నారు. అన్ని రకాలుగా దాన్ని వాడుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి షార్ట్‌కట్‌లో కోటీశ్వరుడు కావటం ఎలా అని చాట్‌జీపీటీని అడిగాడు. అది చెప్పిన సమాధానం చదివి షాక్ అయ్యాడు. ఇంతకీ చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే..
టాప్ డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకో..
డిజిటల్ మార్కెటింగ్
వెబ్ డెవలప్‌మెంట్
డేటా అనాలసిస్
వీడియో ఎడిటింగ్ వంటి వాటిని నేర్చుకోమని చాట్ జీపీటీ సలహా ఇచ్చింది.
ఏఐ టూల్స్ వాడటంలో మాస్టర్ అవ్వు..
చాట్‌జీపీటీ, కాన్వా, మిడ్ జర్నీ వంటి ఏఐ టూల్స్‌పై పట్టు సాధించు. అప్పుడు ఈజీగా నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఏఐ టూల్స్.. నీ ఆదాయాన్ని డబుల్ చేయటంలో సహాయపడతాయి. ఒక ఆదాయ మార్గంపై అస్సలు ఆధారపడవద్దు.
పార్ట్‌టైమ్ పనులు
ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్స్
బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ చేయటం
నీ సొంత డిజిటల్ ప్రాడెక్ట్స్ అమ్మటం వంటివి చేయ్.
తెలివిగా పెట్టుబడులు పెట్టు
సిప్, స్టాక్ మార్కెట్, పీపీఎఫ్, ఎమర్జెన్సీ ఫండ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిపై ఫోకస్ పెట్టు. వీటితో పాటు లింక్డ్ ఇన్‌లో యాక్టీవ్‌గా ఉండు. పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పరుచుకో. కాంటాక్ట్స్ పెంచుకో.
షార్ట్ కట్ లేదు..
తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి లాటరీలు, గ్యాంబ్లింగ్ జోలికి వెళ్లొద్దు. తక్కువ కాలంలో కోటీశ్వరులను చేస్తాం అనే పథకాల్లో చేరవద్దు.. నష్టపోవద్దు అని చాట్‌జీపీటీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు.. మళ్లీ లక్షకు..
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత