Share News

Samsung Triple Fold Phone: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 10:45 AM

జులైలో శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Samsung Triple Fold Phone: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే..

ఇంటర్నెట్ డెస్క్: శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, త్వరలో శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ కూడా త్వరలో విడుదల కానుందని సమాచారం. ఏప్రిల్‌లో ఈ ఫోన్ల ఉత్పత్తి మొదలవుతుందని, జూన్‌ నెల కల్లా మార్కెట్లోకి రావొచ్చని టెక్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు(Samsung).

మీడియా కథనాల ప్రకారం, ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ పేరు గ్యాలెక్సీ జీ ఫోల్డ్‌గా ఖరారైందట. వాస్తవానికి ట్రిపుల్ ఫోల్డ్ గురించి శాంసంగ్ 2023లోనే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేస్తు్న్నట్టు అప్పటి శాంసంగ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది. ఆ తరువాత కొంత కాలానికే హువావే ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ మాటే ఎక్స్‌టీ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. తొలుత చైనాలో ప్రవేశపెట్టి ఆ తరువాత ప్రపంచమంతా లాంచ్ చేసింది. దీంతో, ఒక్కసారిగా పోటీ తీవ్రం కావడంతో శాంసంగ్ కూడా ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది.


Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

మీడియా కథనాల ప్రకారం, ఈ ఫోన్ల తయారీ కోసం శాంసంగ్ ఏర్పిల్ నుంచి విడిభాగా సేకరణ ప్రారంభించి అనంతరం వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనుంది. మొదట్లో శాంసంగ్ పరిమిత స్థాయిలోనే ఈ ఫోన్లు విడుదల చేయొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర భారీగా ఉంటుంది కాబట్టి పరిమిత స్థాయిలో వీటిని విడుదల చేయాలన్న తలంపుతో శాంసంగ్ ఉన్నట్టు తెలుస్తోంది.


Samsung: ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఈ శాంసంగ్ ఫోన్‌పై నమ్మశక్యం కాని డిస్కౌంట్

ఫీచర్స్ ఇవీ..

రెండు వైపులా ఫోల్డ్ చైయగలిగేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. 9.96 అంగుళాల డిస్‌ప్లే,654 అంగుళాల పొడవుతో ఉంటుంది. హువావేకు చెందిన మాటే ఎక్స్‌టీతో సమానమైన బరువుతో శాంసంగ్ ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఫోల్డ్ జీ ఆకారంలో ఉండటంతో ఫోనుకు జీ ఫోల్డ్ అన్న పేరును ఖరారు చేసినట్టు కూడా సమాచారం. ఈ ఫోన్‌లో అండర్ డిస్‌ప్లే కెమెరా కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇందుకు బదులు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పూర్తిస్థాయి ఫీచర్లతో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్‌లో శాంసంగ్.. గ్యాలెక్సీ జీ ఫ్లిప్ 7 ఎఫ్ఈ మోడల్ ఫోల్డబుల్ ఫోన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తుందట.

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 25 , 2025 | 10:45 AM