Share News

Samsung: ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఈ శాంసంగ్ ఫోన్‌పై నమ్మశక్యం కాని డిస్కౌంట్

ABN , Publish Date - Feb 22 , 2025 | 09:42 AM

గేలక్సీ జీ ఫోల్డ్ 5 వాస్తవ ధర రూ.154999 కాగా ప్రస్తుతం ఇది దాదాపు సగం రేటుకే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. త్వరపడితే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Samsung: ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఈ శాంసంగ్ ఫోన్‌పై నమ్మశక్యం కాని డిస్కౌంట్

ఇంటర్నెట్ డెస్క్: ఫోల్డబుల్ ఫోన్ అంటే అనేక మందికి ఇష్టం. కానీ ధర చూసి వెనుకంజ వేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి వారికోసమే తాజాగా ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. శాంసంగ్‌కు ప్రీమియం ఫోల్డబుల్ ఫోను.. గేలక్సీ జీ ఫోల్డ్ 5 వాస్తవ ధర ఏకంగా రూ.154999 కాగా దాదాపు సగం రేటుకే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. పవర్‌ఫుల్ ఫీచర్లు, అద్భుత పర్‌ఫార్మెన్స్‌తో ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇంతకు మించిన ఫోన్ లేదని అనుభవజ్ఞులు చెబుతున్నారు (Samsung).

New SIM: కొత్త సిమ్ కొనబోతున్నారా.. VIP నంబర్ కోసం ఇలా బుక్ చేసుకోండి..


ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్

శాంసంగ్ గేలక్సీ జీ ఫోల్డ్ 5 మోడల్ 256 జీబీ వేరియంట్‌పై ఫ్లిప్ కార్ట్ ఏకంగా రూ.55 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. దీంతో, ఫోన్ ధర లక్షకు దిగువకు చేరుకుంది. దీంతో పాటు ఇతర ఆఫర్లను కూడా వినియోగించుకుంటే అసలు ధర కంటే 50 శాతం తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. క్టమర్లు తమ పాత ఫోన్లను ఎక్సేంజ్ చేసుకుని రూ.58,150 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. ఉదాహరణకు శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్23 ఎక్సేంజ్ చేసుకుంటే రూ.20 వేల డిస్కౌంట్ పొందొచ్చు

ఇక ఫ్లిప్‌కార్డు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులకు కూడా అదనపు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్డుతో వచ్చే రూ.4 వేల మినహాయింపును కూడా కలుపుకుంటే గాలెక్సీ జీ ఫోల్డ్ 5ని కేవలం రూ.75,999కే సొంతం చేసుకోవచ్చు.


గాలెక్సీ జీ ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఏంటంటే..

120 హెచ్‌జీ రిఫ్రెష్ రేట్‌ ఉన్న 7.6 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఫోన్‌ను ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వైపు కనిపించే 6.2 అంగుళాల ఔటర్ స్క్రీన్‌తో ఫోన్ అన్‌ఫోల్డ్ చేయకుండానే ప్రాథమిక పనులన్నీ చేసుకోవచ్చు. ఇది ఐపీఎక్స్8 రేటింగ్ ఉన్న వాటర్ రెసిస్టెంట్ ఫోను. అంటే దీనిపై అనుకోకుండా ఏదైనా పానీయం చిందినా సమస్యలేవీ ఉండవు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉన్ ఈ ఫోన్ పర్‌ఫార్మెన్స్ అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. ఇతర ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే.. ఫోన్ వెనక వైపు 50ఎంపీ మెయిన్ సెన్సర్, 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉన్న 10 ఎపీ టెలీఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా, లోపలివైపు 4ఎంపీ అండర్ డిస్‌ప్లే కెమెరా, ముందువైపు 10 ఎంపీ కెమెరా ఉన్నాయి. 4400 ఎమ్ఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రోజంగా చార్జింగ్ నిలిచే ఉంటుంది. 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా తోడవడంతో అవసరమైన సందర్భాల్లో వేగంగా ఫోన్‌ను చార్జి్ చేసుకోవచ్చు. అయితే, చార్జర్ సపరేటుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 22 , 2025 | 10:13 AM