Share News

Samsung Unveils A series Phones: శాంసంగ్ కొత్త మోడల్స్.. వీటి ఏఐ ఫీచర్స్ చూస్తే..

ABN , Publish Date - Mar 03 , 2025 | 08:51 AM

శాంసంగ్ తాజాగా ఏఐ ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వీటి ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Samsung Unveils A series Phones: శాంసంగ్ కొత్త మోడల్స్.. వీటి ఏఐ ఫీచర్స్ చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: బడ్జెట్ ఫోన్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్. ఏఐ ఫీచర్లతో అందుబాటు ధరల్లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను శాంసంగ్ తాజాగా ఆవిష్కరించింది. ఏఐ ఆధారిత ఫీచర్లతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టు, అధిక సామర్థ్యం గల హార్డ్‌వేర్‌ ఉన్న ఈ ఫోన్స్‌పై వినియగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. గూగుల్ పిక్సెల్‌ లాంటి ఏఐ ఆధారిత ఇమేజ్ ఎడింగ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్‌తో ఒక మోషన్ ఫొటోలో దాదాపు ఐదుగురి ముఖకవళికలను మార్చే అవకాశం ఉంది (Samsung Unveils A Series Phones).

ఏ56, ఏ36, ఏ2 పేరిట మూడు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌ను శాంసంగ్ విడుదల చేసింది. ఈ మూడు మోడళ్లకు ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, ఓఎస్ అప్‌‌డేట్స్ అందిస్తామని సంస్థ పేర్కొంది. దీంతో, సుదీర్ఘకాలం పాటు ఈ ఫోన్స్ మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొంది. ఈ ఫోన్స్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెడ్‌‌డీ ప్లస్, 120 హెర్ట్స్ రిఫ్రెష్ రేటుతో సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, అన్ని రంగుల షేడ్స్ స్పష్టంగా కనబడేలా 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, పానీయాలు చిలికినా పాడుకాకుండా ఐపీ67 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌లో ఈ ఫోన్లకు ఉన్నాయని పేర్కొంది. మూడు ఫోన్లల్లో ఒన్‌యూఐ 7.0 ఆధారిత ఆండ్రియన్ 15 ఓఎస్ ఉంటుంది. తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లు అందించేలా డిజైన్ చేసింది.


ChatGPT 4.5: చాట్‌జీపీటీ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. ఫీచర్లు ఏంటంటే..

గాలెక్సీ ఏ56.. సూపర్ ఫర్‌ఫార్మెన్స్

ఈ మోడల్‌లో ఎక్సీనోస్ 1580 ప్రాసెస్, ఎక్లిప్స్‌ 540 జీపీయూ ఉండటంతో మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు ఇది అత్యంత అనుకూలం. 8జీబీ/15జీబీ ర్యా్మ్, 128జీబీ/256జీబీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఓఐఎస్ సెన్సర్ ఉన్న 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 12ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 5ఎంపీ మాక్రోషూటర్ ప్రధాన కెమెరా ఉంది. ఇక ఫోన్ ముందువైపు ఉన్న 12 ఎంపీ కెమెరాతో హైక్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్స్ చేయొచ్చు. ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 5.3, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది. అయితే, చార్జర్ మాత్రం విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది.

గ్యాలెక్సీ ఏ36..

ధరకు, ఫీచర్లకు మధ్య సమతూకం పాటించేలా శాంసంగ్ ఈ మోడల్‌ను సిద్ధం చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, అడ్రీనో 710 జీపీయూ, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఇందులో ఉన్నాయి. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండటం మరో ప్రత్యేకత.


Samsung Triple Fold Phone: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే..

ఏ26.. అత్యంత సరసమైన ధరకు పూర్తిస్థాయి ఫీచర్స్

ఏ26 మోడల్‌లో ఎక్సీనోస్ 1380 ప్రాసెసర్, మాలీ-జీ68 ఎమ్‌పీ5 జీపీయూ, 1 టెర్రాబైట్ వరకూ స్టోరేజీని సపోర్టు చేసే మైక్రోఎస్‌డీ స్లాట్ ఉంది. 50ఎమ్‌పీ ప్రైమరీ సెన్సర్ 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 25వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

కాగా,ఏ56 మోడల్ ధర సుమారు రూ.44 వేల నుంచి రూ.48 వేల (హైఎండ్ వేరియంట్) వరకూ ఉండనుంది. ఇక ఏ36 ధరలు రూ.35 వేల నుంచి రూ.37 వేల మధ్య , ఏ26 ధరలు రూ.26 వేల నుంచి రూ33 వేల వరకూ ఉంటుంది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 03 , 2025 | 09:16 AM