ChatGPT: చాట్‌జీపీటీకి ఒక్క ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చినందుకు ఎంత కరెంట్ ఖర్చువుతుందో తెలుసా
ABN , Publish Date - Jun 12 , 2025 | 10:20 PM
ఒక్క ప్రశ్నకు సమాధానమిచ్చినందుకు చాట్‌జీపీటీ. 0.34 వాట్ అవర్ విద్యుత్ వినియోగం అవుతుందని సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తాజాగా తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఐటీ సాంకేతిక కొత్త పుంతలు తొక్కే కొద్దీ విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు హరిత ఇంధనాల వైపు మళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ విద్యుత్ వినియోగం గురించి సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తాజాగా తన బ్లాగ్ పోస్టులో కొన్ని వివరాలు వెల్లడించారు.
చాట్‌జీపీటీకి వచ్చే ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఖర్చయ్యే సగటు విద్యుత్‌తో ఓ లైట్ బల్బును కొన్ని నిమిషాల పాటు ఆన్‌లో ఉంచొచ్చని చెప్పారు. ఇందుకోసం ఓ టీస్పూన్‌లోని 15వ వంతు నీరు కూడా ఖర్చువుతుందని అన్నారు. డాటా సెంటర్ ప్రొడక్షన్, ఆటోమేషన్, ఖర్చులు తదితర వివరాల గురించి ఆయన వెల్లడించారు.
‘ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు చాట్‌జీపీటీకి ఎంత ఖర్చు అవుతుందన్న కుతూహలం అనేక మందిలో ఉంటుంది. ఇందుకోసం సగటున .34 వాట్ అవర్ విద్యుత్ వినియోగం అవుతుంది. ఇది ఒక మైక్రోవేవ్ ఓవెన్ క్షణకాలం పాటు వినియోగించే విద్యుత్‌కు సమానం. ఈ విద్యుత్‌తో ఓ లైట్‌బల్బ్‌ను కొన్ని నిమిషాల పాటు ఆన్‌లో ఉంచొచ్చు’ అని ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
భవిష్యత్తులో ఇలాంటి అత్యాధునిక సాంకేతికతలతో పాటు విద్యుత్ కూడా అందరి అవసరాలకు సరిపడా అందుబాటులోకి వస్తుందని అన్నారు. మానపురోగతికి ఇప్పటివరకూ ఇవే ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని అన్నారు. ఏఐ వినియోగంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన పెరుగుతోంది. క్రిప్టోమైనింగ్ విద్యుత్ అవసరాలను మించిపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో శామ్ ఈ వివరాలను వెల్లడించారు.
ఇక మరో సందర్భంగా శామ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఈ భూమ్మీద జీవించిన మనుషులు అందరికంటే చాట్‌జీపీటీ శక్తిమంతమైనదని తెలిపారు. ఇక ఏఐ వినియోగానికి అయ్యే ఖర్చులు కూడా భారీగా తగ్గుతున్నాయని, ఏటా ధరల్లో పది రేట్ల మేర కోతపడుతోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయంతో ఇక్కట్లు.. ఈ ఏఐ చాట్‌బాట్స్‌తో పరిష్కారం
ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్
Read Latest and Technology News