ChatGPT Shopping Feature: చాట్‌జీపీటీలో మరో కొత్త ఫీచర్.. ఇక షాపింగ్ మరింత ఈజీ
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:53 AM
ఓపెన్ ఏఐ తాజాగా చాట్‌జీపీటీకి షాపింగ్ ఫీచర్ కూడా జోడించింది. ఉత్పత్తుల ధరలు, ఫీచర్లు, ప్రాడక్ట్ రివ్యూల మధ్య పోల్చి చూసి నచ్చినది ఎంచుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను డిజైన్ చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చాట్‌జీపీటీ యాప్ ద్వారా ఇకపై యూజర్లు నేరుగా షాపింగ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. సెర్చ్ మోడ్‌కు ఈ ఫీచర్‌ను జత చేసినట్టు పేర్కొంది. దీని ద్వారా కావాల్సినవి సెర్చ్ చేస్తే ఇందుకు సంబంధించిన వివరాలను చాట్‌జీపీటీ యూజర్ల ముందుంచుతుంది. షాపింగ్ మరింత సులభతరం చేసేందుకు తాము ఈ ఫీచర్ ప్రవేశపెట్టినట్టు చాట్ జీపీటీ ఎక్స్ వేదికగా పేర్కొంది. ‘‘షాపింగ్ మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశం. నచ్చిన వస్తువులు సెర్చ్ చేయడంతో పాటు వాటిని ఒకదానితో మరొకటి పోల్చి చూడటం, కొనుగోలు చేయడం ఇప్పుడు చాట్‌జీపీటీతో సాధ్యం’’ అని పేర్కొంది.
ప్రస్తుతం చాట్‌జీపీటీలో సెర్చ్ ఫీచర్‌యే అత్యంత పాప్యులర్ అని కూడా సంస్థ పర్కొంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించింది. గత వారంలో 1 బిలియన్ సెర్చ్‌లు జరిగినట్టు కూడా తెలిసింది. తాజాగా ప్రవేశపెట్టిన షాపింగ్ ఫీచర్‌తో వస్తువుల సెర్చి రిజల్ట్స్ మరింత మెరుగ్గా, విజువల్ డీటెయిల్స్‌తో, ధర, రివ్యూలు, కొనుగోలు చేసుందుకు అవసరమైన లింక్స్ కూడా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇవి యాడ్ ఆధారితం కాదని, స్వతంత్ర్యంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల వివరాలని పేర్కొంది. ఈ ఫీచర్‌ను క్రమంగా ఉచిత వినియోగదారులతో పాటు, ప్లస్, ప్రో సబ్‌స్క్రిప్షన్‌ల వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. రాబోయే రోజుల్లూ ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.
మరోవైపు వాట్సాప్‌లో చాట్‌జీపీటీ సెర్చ్ ఫీచర్లను కూడా ఓపెన్ ఏఐ అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లు నేరుగా 1-800-ChatGPT కు మేసేజ్ చేస్తే లైవ్ స్కోర్లు, ఇతర తాజా సమాచారాన్ని పొందొచ్చు. సింగిల్ రెస్పాన్స్‌కు పలు సైటేషన్లు అందుబాటులోకి తెచ్చే విధంగా సెర్చ్ ఫీచర్‌ను ఓపెన్ ఏఐ తాజా పరిచింది. సైటేషన్స్‌లో ముఖ్యమైన అంశాలు స్పష్టంగా కనిపించేలా హైలైట్ ఫీచర్‌కూడా ఉన్నట్టు తెలిపింది. వీటితో పాటు ట్రెండింగ్, ఆటోకంప్లీట్ సెర్చులు కూడా సెర్చ్ ఆప్షన్‌కు జతకూడాయి. గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఓపెన్ ఏఐ ఆసక్తి కనబరిచిన కొద్ది రోజులకే సంస్థ కొత్త సెర్చ్ ఫీచర్లను అందుబాటులోకి తేవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు
జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం
చైనా అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి
Read Latest and Technology News