OpenAI Competition With Google: గూగుల్ క్రోమ్‌కి కాంపిటీషన్.. త్వరలో ఓపెన్ఏఐ నుంచి కొత్త బ్రౌజర్..!
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:51 AM
ఓపెన్ ఏఐ త్వరలో ఓ కొత్త వెబ్ బ్రౌజర్‌ను తీసుకురాబోతోంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ఈ బ్రౌజర్‌లో చాట్ జీపీటీ (ChatGPT) వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో 3 బిలియన్లకి పైగా యూజర్లతో గూగుల్ క్రోమ్(Google Chrome) ఇప్పటికీ టాప్ బ్రౌజర్‌గా కొనసాగుతోంది. అయితే, ఓపెన్ఏఐ(OpenAI) త్వరలో గూగుల్ క్రోమ్‌కు కాంపిటీషన్‌గా ఓ కొత్త వెబ్ బ్రౌజర్‌ను తీసుకురాబోతోంది. ఇది సాధారణ బ్రౌజర్ కాదండోయ్.. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ఈ బ్రౌజర్‌లో చాట్ జీపీటీ (ChatGPT) వంటి ఫీచర్లు చాలానే ఉంటాయి. ఇది గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను పూర్తిగా మార్చేస్తుందని ఊహిస్తున్నారు.
ఓపెన్ఏఐ బ్రౌజర్ స్పెషల్ ఫీచర్లు ఇవే:
AI సహాయంతో బ్రౌజింగ్
గూగుల్ లాగా టైప్ చేసి వెబ్‌సైట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఏ విషయాన్నైనా బ్రౌజర్‌లోనే చాట్ జీపీటీని అడగవచ్చు. వెంటనే సమాధానం వస్తుంది. అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
టైమ్ సేవ్
మీరు ఓ పెద్ద ఆర్టికల్ ఓపెన్ చేసినప్పుడు, దానిని చదవకుండానే సారాంశం మీ ముందు ఉంటుంది. ముఖ్యమైన విషయాలు తెలిసేలా సారాంశం ఉంటుంది. దీంతో టైమ్ సేవ్ అవుతుంది.
పెరిగిన భద్రత
ఇతర బ్రౌజర్లలో ఉండేలా యాడ్స్ ట్రాకింగ్, ఇతర డేటా సేకరణ వంటివి ఉండవు. ఓపెన్ఏఐ ఈ బ్రౌజర్‌లో ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.
సింపుల్ డిజైన్, స్మార్ట్ నావిగేషన్
వినియోగదారులకు కావలసిన సమాచారం లేదా ఫీచర్లను సులభంగా కనుగొనడానికి సహాయపడే విధంగా ఈ బ్రౌజర్ ఉంటుంది. వాయిస్ కమాండ్‌లు, AI సెర్చ్ బార్ వంటివి ఉండే అవకాశం ఉంది.
Also Read:
దేశవ్యాప్తంగా IRCTC వీక్లీ టూర్ ప్యాకేజెస్.. టికెట్ గ్యారెంటీ..
వీళ్లకు డబ్బు అప్పుగా ఇచ్చారో.. నష్టం తప్పదు!
For More Lifestyle News