Share News

ChatGPT: చాట్‌జీపీటీని గుడ్డిగా నమ్ముతున్నారా.. దీని సృష్టికర్త చేస్తున్న వార్నింగ్‌ ఏంటో వినండి

ABN , Publish Date - Jun 30 , 2025 | 08:50 PM

చాట్‌జీపీటీని అతిగా విశ్వసించవద్దని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తాజాగా హెచ్చరించారు. అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. హాల్యూసినేషన్‌కు గురైనప్పుడు చాట్‌జీపీటీ తప్పులు చేయొచ్చని అన్నారు. ఏఐ చాట్‌బాట్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏఐ నిపుణులు కూడా చెబుతున్నారు.

ChatGPT: చాట్‌జీపీటీని గుడ్డిగా నమ్ముతున్నారా.. దీని సృష్టికర్త చేస్తున్న వార్నింగ్‌ ఏంటో వినండి
Sam Altman ChatGPT Warning

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చాట్‌జీపీటీని తెగ వినియోగిస్తున్నారు. కొందరు దీనికి అలవాటు కూడా పడిపోతున్నారు. ఈ చాట్‌బాట్‌తో చర్చలు జరుపుతూ, సలహాలు తీసుకుంటూ, సందేహాలు నివృత్తి చేసుకుంటూ అనేక మంది తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అయితే జనాల్లో ఏఐపై నమ్మకం మరీ ఇంతగా పెరిగిపోవడంపై చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.

‘జనాలు చాట్‌జీపీటీని చాలా ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఏఐ కూడా తప్పులు చేసే అవకాశం ఉంది. అంటే.. ఏఐ హాల్యూసినేషన్స్‌తో తప్పులు జరిగే అవకాశం ఉంది. ఏఐకి వినియోగదారులను బురిడీ కొట్టించే తెలివి తేటలు కూడా ఉన్నాయి. తప్పుడు సమాధానాలు సరైనవని అనిపించే రీతిలో కూర్చి మన ముందుంచగలదు’ అని అన్నారు. ఏఐపై ఆధారపడటం పెరిగిపోతోందని, తాను కూడా ఏఐ సలహాలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.


ఏమిటీ ఏఐ హాల్యూసినేషన్స్..

వాస్తవంలో లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకుని వినియోగదారుల ముందుంచే ఏఐ తీరును హాల్యూసినేషన్స్ అని అంటారు. ఉదాహరణకు మీరు ఓ ఉత్పత్తిని కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఆ ప్రాడక్ట్ గురించి ఏఐని సలహా అడిగారు. కానీ ఏఐ మాత్రం హాల్యూసినేషన్‌ బారిన పడి ఉన్నవీలేనివీ కల్పించి చెబుతుంది. మీరు అది నమ్మి వస్తువును కొనుగోలు చేస్తే డబ్బులు మొత్తం వృథా అయిపోతాయి. ఏఐతో ఇంతకంటే పెద్ద చిక్కులు ఉన్నట్టు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. చాట్‌జీపీటీని మూసేద్దామని ఓ వ్యక్తి ప్రయత్నిస్తే ఆ చాట్‌బాట్ బెదిరింపులకు దిగినట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. కాబట్టి, చాట్‌జీపీటీ సహా అన్ని ఏఐ యాప్స్‌ విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఇచ్చే సలహాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించాకే ఫాలో కావాలని హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా

ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్

Read Latest and Technology News

Updated Date - Jun 30 , 2025 | 09:26 PM