Share News

Foldable iPhone: ఫోల్డబుల్ ఐఫోన్‌పై కీలక అప్‌డేట్.. విడుదల అప్పుడేనా

ABN , Publish Date - May 20 , 2025 | 10:38 PM

2025లో ఫోల్డబుల్ ఐఫోన్ విడుదలయ్యే అవకావం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అద్భుత ఫీచర్లతో రూపొందుతున్న ఐఫోన్ ధర కూడా అదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాయి.

Foldable iPhone: ఫోల్డబుల్ ఐఫోన్‌పై కీలక అప్‌డేట్.. విడుదల అప్పుడేనా
Apple foldable phone

ఇంటర్నెట్ డెస్క్: ఫోల్డబుల్ ఐఫోన్ గురించి ఇప్పటికే అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రిలీజ్ ఎప్పుడా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి యాపిల్ పలు డిజైన్లపై పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు టెక్ వార్తా సంస్థలు తాజాగా రాసుకొచ్చాయి. దీంతో, ఫోల్డబుల్ ఫోన్ త్వరలోనే జనాలు ముందుకు రాబోతోందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

టెక్ నిపుణుల అంచనా ప్రకారం ఐఫోన్ 18 సిరీస్‌లో భాగంగా ఫోల్డబుల్ ఫోన్‌ను రిలీజ్ చేసే అకాశం ఉంది. 2026లో ఇది జనాల ముందుకు రావచ్చు. వచ్చే ఏడాది నాలుగో త్రైమాసికంలో.. తొలి విడతగా సుమారు 5 మిలియన్ల వరకూ ఫోల్డబుల్ ఫోన్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది.

వీటి డిస్‌ప్లే కోసం యాపిల్ శాంసంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఔటర్ డిస్‌ప్లే 5.49 అంగుళాలు, ఇన్నర్ డిస్‌ప్లే 7.74 నుంచి 7.8 అంగుళాల వరకూ ఉండే అవకాశం ఉంది. ఇన్నర్ స్క్రీన్ రిజల్యూషన్ 2,713 × 1,920గా ఔటర్ స్క్రీన్ రిజల్యూషన్ 2,088 × 1,422గా ఉండనుంది. 4:3 ఆస్పెక్ట్ రేషియోతో ఐప్యాడ్ మినీ సైజులో ఉండేలా దీన్ని డిజైన్ చేస్తున్నట్టు సమాచారం.


ఇక ఫోల్డబుల్ ఫోన్ కోసం క్రీస్‌‌లెస్ డిస్‌ప్లేను రూపొందించేందుకు యాపిల్ విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం సెల్ఫ్ హీలింగ్ లేయర్లు, స్ట్రెచబుల్ స్క్రీన్‌ డిజైన్‌లపై పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఫోన్‌ను మడతపెట్టే చోట అమర్చేందుకు లిక్విడ్ మెటల్ హింజ్‌ను యాపిల్ రూపొందిస్తున్నట్టు సమాచారం.


ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎమ్ఏహెచ్‌గా ఉండొచ్చు. ఎక్కువ సేపు చార్జ్ నిలిచుండేందుకు 3డీ స్టాక్డ్ బ్యాటరీ డిజైన్‌ను వాడనున్నారు. రెండు సెన్సార్లతో కూడిన అల్ట్రా వైడ్ ప్లస్ మెయిన్ కెమెరా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేస్తారు. ప్రమాణాల విషయంలో ఎన్నడూ రాజీ పడని యాపిల్.. ధర విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉండొచ్చని తెలుస్తోంది. అంటే.. దీని ధర 2 వేల నుంచి 2500 డాలర్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఇలాంటి వార్తల నేపథ్యంలో ఐఫోన్ ప్రియుల ఉత్కంఠ క్షణక్షణానికీ పతాకస్థాయికి చేరుకుంటోంది.

ఇవి కూడా చదవండి

విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే

ఇంట్లో వైఫై రౌటర్ ఉందా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ కంటే బెటర్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చే యాండ్రాయిడ్ ఫోన్స్ ఇవే

Read Latest and Technology News

Updated Date - May 20 , 2025 | 10:38 PM