Smart Phone Features: మీకు స్మార్ట్ ఫోన్ ఉందా.. మరీ 8 ముఖ్యమైన ఫీచర్ల గురించి తెలుసా
ABN , Publish Date - Apr 19 , 2025 | 06:21 PM
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన ఫీచర్స్ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవని కాలం ఇది. అయినా, చాలా మందికి స్మార్ట్ ఫోన్‌పై పూర్తి అవగాహన ఉండదు. అందులోని ఫీచర్స్ గురించి పూర్తిగా తెలియక స్మార్ట్ సౌకర్యాలను కోల్పోతున్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ తెలిసుండాల్సిన కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
స్క్రీన్ పిన్నింగ్
ఎవరికైనా మన స్మార్ట్ ఫోన్ ఇచ్చినప్పుడు ఈ ఫీచర్‌తో వారిని ఏదో ఒక యాప్ వినియోగానికే పరిమితం చేయొచ్చు. ఒక్కసారి దీన్ని ఆన్ చేస్తే ఒక యాప్ మాత్రమే వినియోగించుకునేలా ఫోన్ లాక్ అయిపోతుంది. దీంతో, మీ మెసేజీలు, ఫొటోలను ఇతరులు చూడలేరు. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే సెట్టింట్స్ > సెక్యూరిటీ > స్క్రీన్ పిన్నింగ్ (ఎనేబుల్ చేయాలి)
బ్యాక్ టాప్ (ఐఫోన్)
ఇది ఐఫోన్‌లల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పీచర్‌ను ఆన్ చేసుకుంటే ఫోన్ వెనకవైపు వేళ్లతో రెండు లేదా మూడు సార్లు తట్టి స్క్రీన్ షాట్స్ తీసుకోవడం, యాప్స్ ఓపెన్ చేయడం, ఇతర నచ్చిన పనులను చేసుకోవచ్చు
సెట్టింట్స్ > యాక్సెసబిలిటీ > టచ్ > బ్యాక్ టాప్ లో దీన్ని ఆన్ చేసుకోవచ్చు
వన్ హ్యాండెడ్ మోడ్
పెద్ద ఫోన్లు వాడేందుకు రెండు చేతుల వేళ్లూ వినియోగించాల్సి వస్తుంది. అయితే, ఈ పీచర్‌తో కేవలం ఒక్క చేతి బోటన వేలితోనే ఫోన్ సులువుగా నియంత్రించొచ్చు
యాండ్రాయిడ్: సెట్టింగ్స్ > సిస్టమ్ > జెస్చర్స్ > వన్ హ్యాండెడ్ మోడ్
ఐఫోన్: స్క్రీన్ చివరను స్వైప్ చేస్తే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
హిడెన్ వైఫై క్యూఆర్ కోడ్
పాస్‌వర్డ్ చెప్పాల్సిన అవసరం లేకుండానే మీ వైఫై షేర్ చేయాలంటే స్మార్ట్ ఫోన్‌లో ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి దాన్ని అవతలి వారికి చూపించి స్కాన్ చేయమని చెప్పొచ్చు.
ఇందుకోసం సెట్టింగ్స్ > వైఫై > టాప్ ఆన్ కనెక్టెడ్ > నెట్వర్క్ షేర్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి
ఫింగర్‌ప్రింట్‌తో యాప్ లాక్
కొన్ని స్మార్ట్ ఫోన్లలలో ఒక్కో యాప్‌ను విడివిడిగా ఫింగర్ ప్రింట్స్‌తో లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇమేజీల డ్రాగ్ అండ్ డ్రాప్
ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న కొన్ని ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని సాయంతో గ్యాలెరీలోని ఫొటోలను నేరుగా డ్రాగ్ చేసి ఈమెయిల్ లేదా చాట్‌లో పెట్టుకోవచ్చు.
వాల్యూమ్ బటన్‌తో కెమెరా లాంచ్
ఫొటో తీసుకునేందుకు ప్రతిసారీ ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సిన అవసరం లేదు. పవర్ లేదా వాల్యూమ్ బటన్‌ను రెండు మార్లు ఒత్తితే కెమెరా ఆన్ అయిపోతుంది. చాలా ఫోన్లలో ఈ ఫీచర్ ఉంది.
డాక్యుమెంట్ స్కానర్
యాండ్రాయిడ్‌లోని గూగుల్ డ్రైవ్, ఐఫోన్‌లోని నోట్స్ ద్వారా మీరు డాక్యుమెంట్స్‌ను మరింత క్లారిటీతో స్కాన్ చేసుకోవచ్చు. ఇందుకు కోసం థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన అవసరమే లేదు.
ఇవి కూడా చదవండి:
యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు
జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం
చైనా అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి
Read Latest and Technology News