Google AI: సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పిన గూగుల్ ఏఐ గణాంకాలు చూశారా..
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:14 PM
ఏఐ విభాగంపై గూగుల్ కూడా పట్టుసాధిస్తోంది. ఇందుకు రుజువుగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ పలు గణాంకాలను పంచుకున్నారు. మరి ఏఐ రేసులో గూగుల్ ఎంత పురోగతి సాధించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ విభాగంలో గూగుల్ క్రమంగా దూసుకుపోతోంది. ఇందుకు రుజువుగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ పలు గణాంకాలను పంచుకున్నారు.
గూగుల్ ఏఐ టోకెన్ వినియోగం దాదాపు రెట్టింపైంది. ప్రస్తుతం నెలకు 980 ట్రిలియన్ టోకెన్‌లను గూగుల్ ఏఐ ప్రాసెస్ చేస్తోంది. స్థూలంగా చెప్పాలంటే.. యూజర్లు టైప్ చేసే ప్రతి పదాన్ని ఓ టోకెన్‌గా భావించొచ్చు. వీటినే ఏఐ మోడల్స్ ప్రాసెస్ చేసి సమాధానాలను ఇస్తుంటాయి. యూజర్ల పెరిగారనేందుకు టోకెన్‌ల ప్రాసెసింగ్ ఓ నిదర్శనం.
ఇక గూగుల్ జెమినీ యూజర్ల సంఖ్య 450 మిలియన్‌లకు చేరింది. జెమినీ రోజూ యూజర్ల నుంచి అందే అభ్యర్థనల సంఖ్య తొలి త్రైమాసికంతో పోలిస్తే 60 శాతం పెరిగింది.
ఇక గూగుల్ మీట్‌లో కూడా ఏఐ వినియోగం పెరిగింది. మీట్‌కు అనుసంధానంగా ఉండే ఏఐ నోట్స్‌ను కేవలం జూన్ నెలలోనే 50 మిలియన్‌ల మంది వినియోగించారు. దీంతో, జనాలు తమ వృత్తికి అనుబంధంగా ఏఐని వినియోగిస్తున్న అంశం స్పష్టమవుతోంది.
గూగుల్‌కు చెందిన ఏఐ వీడియో క్రియేషన్ టూల్‌కు కూడా క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం నెల వారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 1 మిలియన్‌గా ఉంది.
ఇక యూట్యూబ్‌లో షార్ట్స్ హవా కొనసాగుతోంది. ఈ వీడియోలకు రోజుకు వచ్చే సగటు వ్యూస్ 200 బిలియన్‌లను దాటాయి.
ఇక గూగుల్‌కు చెందిన అన్ని ఫీచర్స్‌లోనూ ఏఐని జోడించేందుకు సంస్థ విస్తృత కసరత్తు చేస్తోంది. డాక్స్ నుంచి మీట్ వరకూ ప్రతి ఫీచర్‌కు ఏఐ అనుసంధానంగా అందుబాటులోకి వచ్చింది. దీంతో, గూగుల్ ఎకోసిస్టమ్ మొత్తం భారీ మార్పులకు లోనవుతోందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఏఐ కేంద్రంగా గూగుల్ మారుతోందని అంటున్నారు. టోకెన్ వినియోగం పెరగడటమే ఇందుకు నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
గూగుల్‌కు షాక్.. గత 10 ఏళ్లల్లో తొలిసారిగా 90 శాతం దిగువకు సెర్చ్ మార్కెట్ వాటా
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..