Google Tracking: నిరంతర ట్రాకింగ్.. మీ గురించి ఏ విషయాలు గూగుల్‌కు తెలుసంటే..
ABN , Publish Date - Aug 03 , 2025 | 02:30 PM
యూజర్‌లను నిరంతరం ట్రాక్ చేసే గూగుల్‌కు మీ సమాచారం ఎంత చేరిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ట్రాకింగ్‌పై పరిమితులు విధించాలని అనుకుంటున్నారా? ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ మన జీవితంలో ఓ ముఖ్య భాగమైంది. డిజిటల్ ప్రపంచమంతా విస్తరించింది. అక్కడ మన ప్రతి చర్య గురించీ గూగుల్‌కు తెలుసు. చాలా మందికి ఈ విషయంపై అవగాహన కూడా ఉంది. యూజర్‌లను ట్రాక్ చేస్తామని గూగుల్ ముందుగానే చెప్పి ఆ మేరకు వారిచ్చిన అనుమతులతోనే ఇలా ట్రాక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు యూజర్‌లకు సంబంధించిన ఏయే వివరాలు గూగుల్‌కు చేరతాయో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
సెర్చ్, మ్యాప్స్, యూట్యూబ్, క్రోమ్ బ్రౌజర్, జీమెయిల్, యాండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా గూగుల్ ఓ క్రమపద్ధతిలో యూజర్ల సమాచారం సేకరిస్తుంది. ఇన్‌కాగ్నిటో మోడ్, వీపీఎన్‌లు కూడా ఈ సమాచార సేకరణను పూర్తిస్థాయిలో అడ్డుకోలేవు.
సెర్చ్ సమయంలో మీ క్వైరీలు, దేనిపై క్లిక్ చేశారు, ఏయే అంశాలపై ఎంత సమయం వెచ్చించారు అన్న విషయాలు గూగుల్‌కు తెలుస్తాయి. యూట్యూబ్‌లో వీక్షించే వీడియోలను బట్టి యూజర్ల అభిరుచికి సంబంధించిన వివరాలు గూగుల్‌కు చేరతాయి. జీమెయిల్ ద్వారా పర్యటనలు, షెడ్యూల్స్, కొనుగోళ్లకు సంబందించి వివరాలు గూగుల్‌కు చేరుతాయి. ఇక మ్యాప్స్ ద్వారా రియల్ టైం లొకేషన్, ఏయే ప్రదేశాలను సందర్శించారు, ఎంత దూరం ప్రయాణించారు వంటి వివరాలు గూగుల్‌కు చేరిపోతాయి.
ఇక గూగుల్ ఇప్పటివరకూ తమ గురించి ఏయే విషయాలను తెలుసుకుందీ అనే అంశాన్ని యూజర్లు MyActivity.google.com లో చూసి చెక్ చేసుకోవచ్చు. AdsSettings.google.com లోకి వెళితే యూజర్‌లు తమ అభిరుచుల గురించి గూగుల్‌కు ఎంత సమాచారం చేరిందో తెలుసుకోవచ్చు. ఇందులో ఎలాంటి దాపరికాలూ ఉండవు. ఇక మ్యాప్స్‌లోని టైమ్‌లైన్ ఫీచర్‌లో యూజర్ ఫిజికల్ లొకేషన్‌కు సంబంధించిన వివరాలు నమోదవుతాయి.
అయితే, గూగుల్‌కు చేరే సమాచారాన్ని నియంత్రించేందుకు కూడా బోలెడు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. యూజర్లు తమ అకౌంట్‌లోకి వెళ్లి అప్పటివరకూ రికార్డయిన సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, అవసరమనుకుంటే డాటా ప్రైవసీ సెట్టింగ్స్‌లో యూజర్లు తమ ట్రాకింగ్‌ను ఆపివేయొచ్చు. ఈ వివరాలను డిలీట్ చేసే అవకాశం కూడా ఉన్నా కొంత సమాచారం మాత్రం న్యాయపరమైన, కార్యనిర్వాహక అవసరాల కోసం గూగుల్ వద్ద మిగిలిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్.. స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్
చార్జింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే..
Read Latest and Technology News