Chatgpt Model Selection Guide: రకరకాల చాట్‌జీపీటీ మోడల్స్.. ఏది ఎప్పుడు ఎలా వాడాలో తెలుసా
ABN , Publish Date - Apr 27 , 2025 | 02:16 PM
ప్రస్తుతం ఎన్నో చాట్‌జీపీటీ చాట్ బాట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏవి ఎప్పుడు వాడాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేథకు మారుపేరుగా మారింది చాట్‌జీపీటీ. ఈ చాట్‌బాట్ మాతృసంస్థ ఓపెన్ ఏఐ.. క్రమం తప్పకుండా కొత్త చాట్‌బాట్ మోడల్స్‌ను వినియోగదారుల ముందుకు తెస్తోంది. చాట్ జీపీటీ 4, జీపీటీ -4o, జీపీటీ-4.5, జీపీటీ-o3.. ఇలా ఎన్నో మోడల్స్ ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ చాట్‌బాట్ ఏ పనికి వాడాలన్న సందేహం ఈపాటికే చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే, నిపుణులు దీనికి సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.
చాట్ జీపీటీ - 4o మినీ:
ఇది ఇచ్చిన పనిని చకచకా చేసిపెట్టే చాట్‌బాట్. కొత్త ఐడియాలకు, ఓ అంశానికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకునేందుకు ఉపయుక్తం. స్మార్ట్ ఫోన్ యాప్స్‌తో పాటు హై లేటెన్సీ నెట్వర్క్‌ల్లో వాడుకునేందుకు అనుకూలం. సుదీర్ఘ వ్యాసాలు, ఆడియో, వీడియో లాంటి సంక్లిష్ట మల్టీ మోడల్ టాస్క్‌లకు ఇది అంతగా ఉపయోగకరం కాదు.
చాట్ జీపీటీ - 4o(ఓమ్నీ)
టెక్స్ట్‌తో పాటు ఆడియో, ఇమేజీలు లాంటి మల్టీ మోడల్ ఇన్‌పుట్‌లను కూడా ఇది స్వీకరించగలదు. రియల్ టైమ్‌లో వీడియోల అనొటేషన్, క్రాస్ మీడియా అనాలిసిస్ వంటి పనులకు ఈ మోడల్ అనుకూలం. వివిధ రకాల ఫార్మాట్‌లలో ఔట్‌పుట్‌ను కూడా ఇస్తుంది.
చాట్ జీపీటీ - 4 (స్టాండర్డ్)
తార్కిక సామర్థ్యాలు ఎక్కువగా అవసరమైన పనులకు ఈ మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. ఈ-బుక్స్, వైట్ పేపర్స్, భారీ కంప్యూటర్ కోడ్స్‌ను విశ్లేషించేందుకు, కొత్తవి రూపొందించేందుకు ఇది అనువైనది.
చాట్ జీపీటీ - 4.5 ( ఓరియాన్)
వినియోగదారులకు చాట్‌జీపీటీ - 5 మోడల్ సామర్థ్యాలను పరిచయం చేసే బీటా వర్షెన్ ఇది. ప్రయోగాత్మక పనులకు, అత్యాధునిక సమ్మరైజేషన్‌కు ఇది అవసరం. దీన్ని అత్యవసర పనులకు వినియోగించరాదని నిపుణులు చెబుతున్నారు. మోడల్ కొత్తది కావడంతో తప్పులు చేసే అవకాశం ఎక్కువని అంటున్నారు.
చాట్ జీపీటీ - o3
విశ్లేషణా సామర్థ్యాలు ఈ మోడల్‌కు అధికం. విజువల్ ఎనలిటిక్స్, మల్టీ ఫేసెటెడ్ సంక్లిష్ణ పనులను ఈ మోడల్ సులువుగా చేస్తుంది. విజువల్ ఎనలిటిక్స్, ఇన్‌ఫోగ్రాఫిక్స్ చదివేందుకు, సైంటిఫిక్ రీసెర్చ్‌కు ఇది ఉత్తమం. అయితే, డాటా విశ్లేషణ అధికంగా ఉన్న పనులు ఈ మోడల్‌కు చెప్పకపోవడమే మంచిది.
చాట్‌జీపీటీ - o4 మినీ
స్టెమ్, నాన్ స్టెమ్ రంగాలకు అవసరమైన తార్కిక శక్తిలో తనకు తానే సాటి అని ఈ మోడల్ నిరూపించింది. మ్యాథ్, కోడింగ్, డాటా సైన్స్ వంటివాటికి ఇది అనుకూలం.
ఇవి కూడా చదవండి:
యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు.. ఇప్పటివరకూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయ్యాయంటే..
యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు
జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం
Read Latest and Technology News