Zimbabwe Thrilling Win: జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:36 AM
జింబాబ్వే, బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది

బంగ్లాతో తొలి టెస్ట్
సిల్హట్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని.. మరో రోజు ఆట మిగిలుండగానే జింబాబ్వే 7 వికెట్ల కోల్పోయి ఛేదించింది. తమ టెస్ట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జింబాబ్వే.. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (54), బెన్ కర్రాన్ (44) రాణించారు. మెహ్దీహసన్ మిరాజ్ 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆటకు నాలుగో రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 194/4తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా 255 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ షంటో (60) నిన్నటి స్కోరు వద్దే అవుట్ కాగా.. జాకర్ అలీ (58) అర్ధ శతకం సాధించాడు. ముజరబాని ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 191.. జింబాబ్వే 273 పరుగులు చేశాయి. కాగా, 2021 తర్వాత విదేశాల్లో జింబాబ్వేకిదే తొలి టెస్ట్ విక్టరీ.