Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ రికార్డ్ మిస్.. మరో 10 పరుగులు చేసి ఉంటే..
ABN , Publish Date - Jul 02 , 2025 | 09:28 PM
తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన జైస్వాల్ ప్రస్తుతం జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ అదిరే ఆరంభాన్ని అందించాడు. అయితే సెంచరీకీ చేరువ అవుతున్న సమయంలో ఔటై నిరాశపరిచాడు. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన జైస్వాల్ ప్రస్తుతం జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ అదిరే ఆరంభాన్ని అందించాడు. అయితే సెంచరీకీ చేరువ అవుతున్న సమయంలో అవుటై నిరాశపరిచాడు. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సెంచరీని మిస్ చేసుకోవడమే కాకుండా మరో అరుదైన రికార్డును కూడా కోల్పోయాడు (Ind vs Eng).
తాజా ఇన్నింగ్స్‌లో జైస్వాల్ మరో 10 పరుగులు చేసి ఉంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచేవాడు. ఆ రికార్డుకు మరో పది పరుగుల దూరంలో ఉండగా ఔటయ్యాడు. ఇంతకు ముందు ద్రవిడ్, సెహ్వాగ్ 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుతానికి జైస్వాల్ 39 ఇన్నింగ్స్‌ల్లో 1990 పరుగులు చేశాడు. మరో పది పరుగులు చేసి ఉంటే 39 ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచేవాడు. తాజా మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 10 పరుగులు చేసి ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డును సమం చేస్తాడు.
కాగా, రెండో తొలి రోజు టీమిండియా తడబడుతోంది. టీ బ్రేక్ తర్వాత స్వల్ప తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది. 182/3తో టీ బ్రేక్‌కు వెళ్లిన టీమిండియా కాస్త పటిష్టంగానే కనబడింది. అయితే టీ బ్రేక్ తర్వాత వరుసగా రిషభ్ పంత్ (25), నితీష్ కుమార్ (1) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (59 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. అంతకు ముందు జైస్వాల్ (87) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం టీమిండియా 63 ఓవర్లకు 217/5తో ఆడుతోంది. గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (3 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి