Vaibhav Suryavanshi: వైరల్ అవుతున్న వైభవ్ చిన్నప్పటి ఫొటో.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే
ABN , Publish Date - Apr 29 , 2025 | 06:32 PM
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ చేసిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. దీంతో ఈ 14 ఏళ్ల కుర్రాడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) రికార్డు నెలకొల్పాడు. అలాగే 14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ చేసిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. దీంతో ఈ 14 ఏళ్ల కుర్రాడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫొటోపై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా సంతోషం వ్యక్తం చేశారు. వైభవ్‌కు ఆరేళ్ల వయసున్నప్పుడు 2017లో అప్పటి పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు మద్దతు తెలుపుతూ స్టేడియంకు వచ్చాడు. ఆ జట్టు జెర్సీ వేసుకుని తండ్రితో కలిసి ఫొటో తీసుకున్నాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోను సంజీవ్ గోయెంకా రీ ట్వీట్ చేశారు. అప్పటి పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు సంజీవ్ గోయెంకా యజమాని అనే సంగతి తెలిసిందే. దీంతో ఆయన వైభవ్‌కు ధన్యవాదాలు తెలిపి అతడి ఇన్నింగ్స్‌ను ప్రశంసించారు.
*గత రాత్రి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ఎంతో ఆశ్చర్యంతో వీక్షించాను. ఈ రోజు ఉదయం ఆరేళ్ల వైభవ్ 2017లో అప్పటి పుణె సూపర్ జెయింట్స్ జట్టును ఉత్సాహపరుస్తున్న ఫొటోను చూశాను. ధన్యవాదాలు వైభవ్. నీకు నా మద్దతు, శుభాకాంక్షలు * అని సంజీవ్ గోయెంకా ట్వీట్ చేశారు. అలాగే వైభవ్‌తో తాజాగా కలిసి తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..