Share News

Vaibhav Suryavanshi: మా అమ్మ రోజుకు మూడు గంటలే నిద్రపోయేది.. తల్లిదండ్రుల కష్టం గురించి వైభవ్ సూర్యవంశీ ఏమన్నాడంటే..

ABN , Publish Date - Apr 29 , 2025 | 06:05 PM

14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

Vaibhav Suryavanshi: మా అమ్మ రోజుకు మూడు గంటలే నిద్రపోయేది.. తల్లిదండ్రుల కష్టం గురించి వైభవ్ సూర్యవంశీ ఏమన్నాడంటే..
Vaibhav Suryavanshi

వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఈ 14 ఏళ్ల కుర్రాడు తన అద్భుత సెంచరీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. 14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (GT vs RR) తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇషాంత్ శర్మ దగ్గర్నుంచి రషీద్ ఖాన్ వరకు అందరి బౌలింగ్‌లోనూ బౌండరీల వర్షం కురిపించి నివ్వెరపరిచాడు (IPL 2025).

vaibhav2.jpg


వైభవ్ సూర్యవంశీ క్రికెట్ డ్రీమ్ వెనుక అతడి తల్లిదండ్రుల కష్టం ఎంతో ఉంది. బీహార్‌కు చెందిన వైభవ్‌కు చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే పిచ్చి. చిన్న వయసులోనే తన ప్రతిభతో అందర్నీ మెప్పించాడు. క్రికెటే ధ్యాసగా మార్చుకుని బీహార్ తరఫున ఆడి వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వంటి క్రికెటర్లను ఆకట్టుకున్నాడు. మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు అతడిని 1.1 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆర్ఆర్ తరఫున ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనూ వైభవ్ అబ్బురపరిచే సెంచరీ సాధించి అందర్నీ మెప్పించాడు. ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ ప్రశంసలు నిజానికి తన తల్లిదండ్రులకు చెందాలని వైభవ్ పేర్కొన్నాడు.


* నా కోసం నా తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. మా అమ్మ నాకోసం తెల్లవారుజామునే నిద్రలేచి భోజనం వండి పంపించేది. ఆమె రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేది. నా కోసం మా నాన్న తన ఉద్యోగం వదిలేసుకున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు మా అన్నయ్య పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. నా కోసం కుటుంబ సభ్యులందరూ ఎంతో కష్టపడ్డారు. ఎప్పటికైనా సాధించాలని మా నాన్న ప్రోత్సహించేవారు. నా కోసం వాళ్లు చాలా కష్టాలు పడ్డారు. ఈ రోజు నా విజయం కేవలం మా అమ్మ, నాన్నల వల్లే వచ్చింది * అని వైభవ్ సూర్యవంశీ చెప్పిన వీడియోను ఐపీఎల్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 06:05 PM