Share News

India vs SA Test series: భారత్‌తో టెస్ట్ సిరీస్.. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు ఇదే..

ABN , Publish Date - Oct 27 , 2025 | 04:04 PM

నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది.

India vs SA Test series: భారత్‌తో టెస్ట్ సిరీస్.. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు ఇదే..
South Africa squad

నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది (India vs South Africa Tests).


గాయం కారణంగా ఇటీవలి పాకిస్థాన్ సిరీస్‌కు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా తిరిగి వచ్చాడు (South Africa squad). భారత్‌తో టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. పాక్ సిరీస్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు టీమిండియాతో జరిగే టెస్ట్ మ్యాచ్‌ల్లో కూడా ఆడబోతున్నారు. కాగా, తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలో, రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు గువాహటిలో జరగబోతున్నాయి.


దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవిల్డ్ బ్రెవిస్, టోని డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో యెన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి, కగిసో రబాడా, ర్యాన్ రికెల్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినె.


ఈ వార్తలు కూడా చదవండి..

రోహిత్ మనసును చదివిన మెజీషియన్

వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు

For More Sports News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 04:04 PM