Share News

Shubhman Gill Century: శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ.. మాంచెస్టర్ టెస్ట్‌లో పోరాడుతున్న టీమిండియా..

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:29 PM

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన క్లాస్ చూపిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో నాలుగో సెంచరీ సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ సెంచరీ గిల్‌లోని అత్యుత్తమ ఆటగాడిని వెలికి తీసింది. 228 బంతుల్లో సెంచరీ చేసిన గిల్ అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

Shubhman Gill Century: శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ.. మాంచెస్టర్ టెస్ట్‌లో పోరాడుతున్న టీమిండియా..
Shubhman Gill Century

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) తన క్లాస్ చూపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో నాలుగో సెంచరీ సాధించాడు (Eng vs Ind). క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ సెంచరీ గిల్‌లోని అత్యుత్తమ ఆటగాడిని వెలికి తీసింది. 228 బంతుల్లో సెంచరీ చేసిన గిల్ అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను కేఎల్ రాహుల్ (90)తో కలిసి గిల్ ఆదుకున్నాడు. నాలుగో రోజు మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ అడ్డుకున్నారు (Shubhman Gill Century).


మాంఛెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ ఐదో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే రాహుల్ అవుటైనప్పటికీ గిల్ మాత్రం పట్టుదలగా ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా, బ్రాడ్‌మన్ (4), సునీల్ గవాస్కర్ (4) తర్వాత ఇంగ్లండ్‌లో ఒక సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అలాగే ఇంగ్లండ్‌లో ఒక సిరీస్‌లో 700కు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా ఆటగాడిగా ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకుంటేనే ఈ సిరీస్‌పై టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.


ప్రస్తుతానికి టీమిండియా 86 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. గిల్ (101 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఇంకా 94 పరుగులు వెనుకబడి ఉంది. గాయంతో బాధపడుతున్న రిషభ్ పంత్ కూడా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో చివరి రోజు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.


ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్


సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 27 , 2025 | 05:53 PM