Share News

Tarun Mannepalli: తరుణ్‌ సంచలనం

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:16 AM

మకావు ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగు షట్లర్‌ తరుణ్‌ మన్నేపల్లి సంచలనం సృష్టించాడు.

Tarun Mannepalli: తరుణ్‌ సంచలనం

  • టాప్‌సీడ్‌కు షాక్‌.. క్వార్టర్స్‌కు చేరిక

  • సాత్విక్‌ జోడీ ముందంజ.. మకావు ఓపెన్‌

మకావు : మకావు ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగు షట్లర్‌ తరుణ్‌ మన్నేపల్లి సంచలనం సృష్టించాడు. టాప్‌సీడ్‌ లీ చుక్‌ యుకి షాక్‌ ఇచ్చి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకు పోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో తరుణ్‌ 19-21, 21-14, 22-20తో వరల్డ్‌ నెం. 15 లీ (హాంకాంగ్‌)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 21-14, 14-21, 21-17 వార్డోయోపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ జంట 10-21, 22-20, 21-16తో కుమగాయ్‌/నిషి (జపాన్‌) జోడీపై గెలుపొంది రౌండ్‌-8కి చేరింది. అలాగే సాయిప్రతీక్‌ /కృష్ణమూర్తి రాయ్‌ జంట 21-18, 21-18తో జునైద్‌/రాయ్‌ కింగ్‌ (మలేసియా) ద్వయంపై నెగ్గి క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. ఆయుష్‌ షెట్టి 18-21, 16-21తో జస్టిన్‌ హో (మలేసియా) చేతిలో ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఐదో సీడ్‌ భారత ద్వయం ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో 21-19, 13-21, 18-21తో మలేసియా జోడీ జిమ్మీ వాంగ్‌/లీ నీ జింగ్‌ చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Updated Date - Aug 01 , 2025 | 06:16 AM