Share News

Rishabh Pant Net Worth: ఈ ఏడాది రిషభ్ పంత్ సంపాదన ఎంతో తెలుసా? భారీగా పెరిగిన ఆదాయం..

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:11 PM

ఈ ఏడాది రిషభ్ పంత్ సంపాదన భారీగా పెరిగింది. ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్ట్, ఎండార్స్‌మెంట్లో పంత్ నికర సంపద భారీ స్థాయిలో ఉంది. ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా పంత్ నిలిచాడు.

Rishabh Pant Net Worth: ఈ ఏడాది రిషభ్ పంత్ సంపాదన ఎంతో తెలుసా? భారీగా పెరిగిన ఆదాయం..
Rishabh Pant

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తన అద్భుత ఆటతీరుతో, వైవిధ్యమైన బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో అమోఘంగా రాణిస్తున్నాడు (Ind vs Eng). ఈ ఏడాది పంత్ సంపాదన భారీగా పెరిగింది. ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్ట్, ఎండార్స్‌మెంట్‌లతో పంత్ నికర సంపద భారీ స్థాయిలో ఉంది. ఐపీఎల్- 2025 వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా పంత్ నిలిచాడు (Rishabh Pant Net Worth).


ఈ 27 కోట్ల రూపాయల్లో పన్ను మినహాయించగా పంత్ దాదాపు 19 కోట్ల రూపాయలను అందుకుంటాడు. అలాగే 2024-25 సీజన్‌కు పంత్ బీసీసీఐ ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను పొందాడు. అంటే ఈ ఏడాది కాలంలో పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా బీసీసీఐ నుంచి రూ.5 కోట్లు వార్షిక వేతనం పొందుతాడు. ఆ కాంట్రాక్ట్ వేతనంతో పాటు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు మ్యాచ్ ఫీజుగా అందుకుంటాడు. అంటే ఈ ఏడాదిలో పంత్ మూడు ఫార్మాట్లలోనూ అన్ని మ్యాచ్‌లూ ఆడితే దాదాపు కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడు.


ఇక, పంత్‌కు మరో భారీ ఆదాయ వనరు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్. అడిడాస్, డ్రీమ్11, జేఎస్‌డబ్ల్యూ, రియల్‌మీ, ఎస్జీ క్రికెట్, బోట్, క్యాడ్‌బరీ వంటి బడా సంస్థలకు పంత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఈ ఏడాది పంత్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా రూ. 20-25 కోట్లు సంపాదిస్తాడు. పంత్‌కు ఢిల్లీ, రూర్కీ, హరిద్వార్‌లలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అలాగే పంత్ గ్యారేజ్‌లో ఆడి A8, ఫోర్డ్ ముస్తాంగ్ మరియు మెర్సిడెస్ GLE వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 3 కోట్లు. కాగా, పంత్ ఆస్తుల విలువ రూ.102 కోట్లు ఉంటుందని అంచనా.


ఇవీ చదవండి:

రిషభ్ పంత్.. ఒకప్పటి కుంబ్లేను గుర్తుకుతెచ్చాడు: మాజీల ప్రశంసలు


ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌కు కొత్త చిక్కులు.. మరో యువతి వేధింపుల ఆరోపణలు

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 05:12 PM