Rishabh Pant Injury: రిషభ్ పంత్.. ఒకప్పటి కుంబ్లేను గుర్తుకుతెచ్చాడు: మాజీల ప్రశంసలు
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:52 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఫీట్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంత్‌ను చూస్తుంటే 2002 నాటి అనిల్ కుంబ్లే గుర్తుకు వస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడో టెస్ట్ మ్యాచ్‌లో చేతి వేలికి గాయం అయినప్పటికీ బరిలోకి దిగి బ్యాటింగ్ చేశాడు (Ind vs Eng). ఇక, ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కాలికి బలమైన గాయం తగిలింది. అయినా కుంటుతూనే మైదానంలోకి దిగి అర్ధశతకం పూర్తి చేశాడు. జట్టుకు అవసరమైన కీలక పరుగులు చేశాడు. పంత్ ఫీట్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంత్‌ను చూస్తుంటే 2002 నాటి అనిల్ కుంబ్లే (Anil Kumble) గుర్తుకు వస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
2002లో వెస్టిండీస్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్ వెళ్లింది. ఆ సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే బ్యాటింగ్ చేస్తుండగా విండీస్ బౌలర్ దిల్లాన్ విసిరిన బంతి తలకు బలంగా తగిలింది. ఆ దెబ్బకు కుంబ్లే మైదానంలోనే కుప్పకూలాడు. అతడు ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. అయితే కుంబ్లే తలకు కట్టు కట్టుకుని మరీ బౌలింగ్ చేశాడు. 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ప్రమాదకర బ్రియాన్ లారాను అవుట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కుంబ్లే పోరాటాన్ని క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేదు.
మళ్లీ, కుంబ్లే తరహాలో రిషభ్ పంత్ కూడా గాయాన్ని లెక్క చేయకుండా మైదానంలోకి దిగాడు. నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లు గాయమైన కాలినే టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసినప్పటికీ పంత్ మాత్రం అద్బుతమైన సంయమనం పాటించాడు. కాగా, గాయంతోనే బ్యాటింగ్‌కు దిగిన పంత్‌ను మైదానంలోని ప్రేక్షకులు నిలబడి చప్పట్లో అభినందించారు. కాగా, వికెట్ కీపింగ్‌కు మాత్రం పంత్ దూరం కాబోతున్నాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేయబోతున్నాడు.
ఇవీ చదవండి:
ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌కు కొత్త చిక్కులు.. మరో యువతి వేధింపుల ఆరోపణలు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి