RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. ప్రభుత్వ రిపోర్టులో సంచలన విషయాలు
ABN , Publish Date - Jul 17 , 2025 | 09:51 AM
RCB Stampede: ఆ రిపోర్టను కర్ణాటక హైకోర్టుకు ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీనేనని స్పష్టం చేసింది. పోలీసుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా.. పోలీసులను సంప్రదించకుండా ఆర్సీబీ విక్టరీ పెరేడ్ చేయడానికి పూనుకుందని పేర్కొంది.

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే జూన్ 4వ తేదీన బెంగళూరులో విక్టరీ పెరేడ్ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం చూసింది. అయితే, పరేడ్ నిర్వహించడానికంటే ముందే రద్దయింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక రిపోర్టు తయారు చేసింది.
ఆ రిపోర్టును కర్ణాటక హైకోర్టుకు ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీనేనని స్పష్టం చేసింది. పోలీసుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా.. పోలీసులను సంప్రదించకుండా ఆర్సీబీ విక్టరీ పెరేడ్ చేయడానికి పూనుకుందని పేర్కొంది. ఆ రిపోర్టులో.. ‘ఆర్సీబీ జూన్ 3వ తేదీన పోలీసులను సంప్రదించింది. విక్టరీ పెరేడ్‌కు అవకాశం ఉందని తెలిపింది. ఇది కేవలం సమాచారం ఇవ్వటం కోసం మాత్రమే చేసింది.
పరేడ్ నిర్వహించటం కోసం చట్టపరంగా పర్మీషన్లు అడుగుతూ కాదు. పోలీసులకు ఎలాంటి అప్లికేషన్ ఇవ్వలేదు. కబ్బన్ పోలీస్ స్టేషన్ సీఐ కూడా కేఎస్‌సీఏకు పరేడ్ కోసం పర్మిషన్ ఇవ్వలేదు. ఎంత మంది వస్తారో తెలీదు కాబట్టి.. ఆయన పర్మీషన్ ఇవ్వలేదు’ అని అన్నారు. రిపోర్టు సబ్‌మిట్ చేస్తున్న సమయంలో కోర్టు, ప్రభుత్వం మధ్య ఓ ఆస్తకికరమైన సంభాషణ జరిగింది. ఆర్సీబీ విక్టర్ పెరేడ్ విషాదంపై సబ్‌మిట్ చేసిన రిపోర్టును అత్యంత గోప్యంగా ఉంచమని ప్రభుత్వం హై కోర్టును కోరింది. అయితే, కోర్టు ఇందుకు ఒప్పుకోలేదు. దాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..
ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..