Rishabh Pant: గిల్‌క్రిస్ట్‌తో పోలికా.. పంత్ చాలా బెటర్.. ఆశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:30 PM
రిషభ్ పంత్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. ఇక, రెండో మ్యాచ్‌లో కీలకమైన సమయంలో వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో చాలా మంది పోల్చుతున్నారు.

టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో అమోఘంగా రాణిస్తున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. ఇక, రెండో మ్యాచ్‌లో కీలకమైన సమయంలో వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist)తో చాలా మంది పోల్చుతున్నారు. అయితే మాజీ క్రికెటర్ అశ్విన్ (R Ashwin) మరో అడుగు ముందుకేసి గిల్‌క్రిస్ట్ కంటే పంత్ బెటర్ బ్యాటర్ అని కితాబిచ్చాడు.
'పంత్ నిజంగా ఉత్తమ ఆటగాడు. అతడు గిల్‌క్రిస్ట్ కాదు. పంత్ తరహా క్వాలిటీ డిఫెన్స్ గేమ్ గిల్‌క్రిస్ట్ దగ్గర లేదు. పంత్‌ను గిల్‌క్రిస్ట్‌తో కాదు.. క్లాస్ బ్యాటర్లతో పోల్చాలి. పంత్ తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో అదరగొట్టగలడు. పంత్ ఇక ఎంత మాత్రం జూనియర్ ఆటగాడు కాదు. అతడి సత్తా ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. పంత్ తన స్టాండర్డ్స్‌కు తగిన విధంగా బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలి. తర్వాతి తరం వారికి రోల్ మోడల్‌లా నిలవాలి' అని అశ్విన్ పేర్కొన్నాడు.
తాజా పర్యటనలో రిషభ్ పంత్ ఓ అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 2000 పైచిలుకు పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. టెస్ట్ మ్యాచ్‌ల్లో తనదైన వేగంతో ఆడుతూ పంత్ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పంత్ సెంచరీలు చేశాడు. ఆండీ ఫ్లవర్ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి