Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు అది ఎవరూ నేర్పలేదు.. కెప్టెన్‌పై అశ్విన్ ప్రశంసల వర్షం..
ABN , Publish Date - Jul 10 , 2025 | 10:46 AM
కెప్టెన్లను ఇబ్బందికర ప్రశ్నలు అడిగి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి విదేశీ జర్నలిస్ట్‌లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కెప్టెన్ ఆత్మవిశ్వాసం కోల్పోతే జట్టు ప్రదర్శన కూడా దెబ్బతింటుందనేది వారి వ్యూహం. కెప్టెన్లు అందరినీ వారు అలాగే ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటారు.

టీమిండియా(TeamIndia) విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మైదానంలోనే కాదు, ప్రెస్ కాన్ఫ్‌రెన్స్‌ల్లో (press conference) కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. కెప్టెన్లను ఇబ్బందికర ప్రశ్నలు అడిగి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి విదేశీ జర్నలిస్ట్‌లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కెప్టెన్ ఆత్మవిశ్వాసం కోల్పోతే జట్టు ప్రదర్శన కూడా దెబ్బతింటుందనేది వారి వ్యూహం. కెప్టెన్లు అందరినీ వారు అలాగే ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటారు. అయితే టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ముందు మాత్రం వారి ఆటలు సాగడం లేదు. ఈ విషయంలో గిల్‌పై అశ్విన్ (R Ashwin) ప్రశంసలు కురిపించాడు.
'విదేశాల్లో కెప్టెన్‌ను టార్గెట్ చేయడం అన్నది సర్వసాధారణం. ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటారు. దీంతో ప్రెస్‌కాన్ఫ్‌రెన్స్‌ల్లో ఎలా మాట్లాడాల్లో మన కెప్టెన్లకు ట్రైనింగ్ ఇస్తుంటారు. అయితే గిల్ మాత్రం చాలా సహజంగానే ఈ నైపుణ్యాన్ని సంపాదించాడు. చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఎక్కడా షో చేస్తున్నట్టు అనిపించడం లేదు. తాను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అలాగే మాట్లాడుతున్నాడు. పాతికేళ్లకే ఇలాంటి పరిణితి సాధించడం చాలా గొప్ప విషయం' అని అశ్విన్ ప్రశంసించాడు.
ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇటీవల ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి విజయం. అంతే కాదు ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి