Virat Kohli: మ్యాచ్ మధ్యలో కోహ్లీని రెచ్చగొట్టా.. సంచలన విషయం బయటపెట్టిన పాకిస్తాన్ స్పిన్నర్..
ABN , Publish Date - Mar 08 , 2025 | 02:47 PM
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కి టీమిండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన గిల్ వికెట్ తీశాడు.

ఐసీసీ ట్రోఫీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు (Ind vs Pak) విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇరు దేశాల ప్రేక్షకులు మాత్రమే కాదు.. మైదానంలోని ఆటగాళ్లు కూడా ఉద్వేగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కి టీమిండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) ఆకట్టుకున్నాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన గిల్ వికెట్ తీశాడు.
శుభ్‌మన్ గిల్ అవుట్ అయిన తర్వాత పెవిలియన్ వైపు చూపిస్తూ అబ్రార్ సంజ్ఞలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ మధ్యలో కోహ్లీని (Virat Kohli) కూడా అబ్రార్ రెచ్చగొట్టాడట. ఆ విషయాన్ని తాజాగా అబ్రార్ పంచుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నేను అతడి దగ్గరకు వెళ్లి.. నా బౌలింగ్‌లో సిక్స్ కొట్టు అని అడిగా. అయితే కోహ్లీ అప్పుడు కోపంగా లేడు. కోహ్లీ గొప్ప బ్యాటర్ మాత్రమే కాదు.. గొప్ప మనిషి కూడా అని అబ్రార్ అన్నాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇస్తూ.. బాగా బౌలింగ్ చేశావు అని తనను కోహ్లీ మెచ్చుకున్నట్టు కూడా అబ్రార్ చెప్పాడు.
*కోహ్లీకి బౌలింగ్ చేయాలనేది నా చిన్నప్పటి కల. ఏదో ఒకరోజు కోహ్లీకి బౌలింగ్ చేస్తానని అండర్-19 ఆడుతున్నప్పుడే తోటి ఆటగాళ్లకు చెప్పేవాడిని. నా కల దుబాయ్‌లో తీరింది. కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్ అద్భుతం. అతడు వికెట్లు మధ్య వేగంగా పరిగెత్తుతున్నప్పుడు చూడడం గొప్ప అనుభూతి* అంటూ అబ్రార్ ప్రశంసించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..