Share News

Ind vs Pak: భారత్‌తో మ్యాచ్.. స్పెషల్ కోచ్‌ను నియమించుకున్న పాకిస్తాన్ టీమ్..!

ABN , Publish Date - Feb 22 , 2025 | 06:09 PM

రసవత్తర మ్యాచ్ కోసం దాయాది దేశాలు సిద్ధమవుతున్నాయి. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది.

Ind vs Pak: భారత్‌తో మ్యాచ్.. స్పెషల్ కోచ్‌ను నియమించుకున్న పాకిస్తాన్ టీమ్..!
Special Coach for Pakistan Cricket Team

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమవుతోంది. రసవత్తర మ్యాచ్ కోసం దాయాది దేశాలు సిద్ధమవుతున్నాయి. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది (Champions Trophy).


ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జట్టు సభ్యులకు శిక్షణ ఇచేందుకు ఓ స్పెషల్ కోచ్‌ను కూడా నియమించింది. ఇప్పటికే పాక్ క్రికెట్ టీమ్‌కు తాత్కాలిక్ హెడ్ కోచ్‌గా ఉన్న సెలెక్టర్ అకిబ్ జావేద్ తనకు సహాయం అందించేందుకు మరో వ్యక్తిని నియమించుకున్నాడు. మాజీ సహచరుడు ముదస్సర్ నాజర్‌ను తాత్కాలికంగా స్పెషల్ కోచ్‌గా నియమించాడు. ముదస్సర్‌కు యూఏఈ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. దీంతో అతడి సహాయం తీసుకునేందుకు అకిబ్ నిర్ణయించుకున్నాడు.


అకిబ్ విజ్ఞప్తి మేరకు ముదస్సర్ శుక్రవారం పాకిస్తాన్ జట్టుతో కలిశాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొని జట్టు సభ్యులకు శిక్షణ ఇచ్చాడు. యూఏఈ పరిస్థితుల గురించి ఆటగాళ్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. కాగా, ముదస్సర్ గతంలో పలుసార్లు పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. ఆ తర్వాత కెన్యా, యూఏఈ టీమ్‌లకు కూడా కోచ్‌గా పని చేశాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముదస్సర్ పాకిస్తాన్ తరఫున 76 టెస్ట్‌లు ఆడి 4114 పరుగులు, 122 వన్డేల్లో 2653 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 22 , 2025 | 06:09 PM