Neeraj Chopra: కాంటినెంటల్ కింగ్ నీరజ్
ABN , Publish Date - Apr 18 , 2025 | 02:49 AM
డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సీజన్ ప్రారంభంలో విజయాన్ని సాధించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్‌లో జావెలిన్ త్రోలో 84.52 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు

న్యూఢిల్లీ: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తాజా సీజన్‌ను విజయంతో ఆరంభించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజర్ జావెలిన్ త్రోలో నీరజ్ 84.52 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. 82.44 మీటర్ల దూరంతో డౌ స్మిత్ (దక్షిణాఫ్రికా) రెండోస్థానం దక్కించుకొన్నాడు. వచ్చే నెల 16న దోహాలో జరిగే డైమండ్ లీగ్ కోసం చోప్రా సన్నాహకాల్లో ఉన్నాడు. ఈసారి 90 మీటర్ల మార్క్ చేరుకోవడంపైనే అతడు ఎక్కువగా దృష్టిపెట్టినట్టు సమాచారం.