Share News

Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ ఎలా పట్టాడంటే..

ABN , Publish Date - Jul 07 , 2025 | 08:22 AM

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో హైదరాబాదీ బాలర్ మహ్మద్ సిరాజ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అద్భుతమైన క్యాచ్ తీసుకుని మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు.

Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ ఎలా పట్టాడంటే..
Mohammed Siraj Takes Stunning catch

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ (Ind vs Eng) మ్యాచ్‌లో హైదరాబాదీ బాలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అద్భుతమైన క్యాచ్ తీసుకుని మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral Video) అవుతోంది.


అప్పటికే 29 బంతులు ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్ జాష్ టంగ్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. స్పిన్, పేస్ అటాక్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో ఆన్ సైడ్ ఫ్లిక్ షాట్‌కు ప్రయత్నించాడు. చాలా తక్కువ హైట్‌లో వేగంగా వచ్చిన ఆ బంతిని కుడి వైపునకు డైవ్ చేస్తూ సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఆనందంతో పాటు ఆశ్చర్యానికి కూడా గురయ్యారు.


అందరూ సిరాజ్ వైపునకు పరిగెత్తుకెళ్లి హత్తుకున్నారు. ఆ వికెట్ పడిన తర్వాత ఇంగ్లండ్ వెంటనే మరో వికెట్ కూడా కోల్పోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.


ఇవీ చదవండి:

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్

పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 09:18 AM