Share News

Mohammed Shami wife: నన్ను చంపించాలనుకున్నావ్.. క్రిమినల్స్‌కు, వేశ్యలకు డబ్బులు పెట్టావు: షమీ భార్య సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:53 PM

షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ విమర్శలు చేశారు. షమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకుల కేసు, భరణంపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇటీవల కోల్‌కతా హైకోర్టు భరణంగా హసీన్‌కు నెలకు రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

Mohammed Shami wife: నన్ను చంపించాలనుకున్నావ్.. క్రిమినల్స్‌కు, వేశ్యలకు డబ్బులు పెట్టావు: షమీ భార్య సంచలన ఆరోపణలు
Mohammed Shami with Ex wife Hasin Jahan

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) వ్యక్తిత్వంపై అతడి మాజీ భార్య హసీన్ జాహన్ (Hasin Jahan) తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరికీ 2014లో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. 2018లో వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ విమర్శలు చేశారు. షమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకుల కేసు, భరణంపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇటీవల కోల్‌కతా హైకోర్టు భరణంగా హసీన్‌కు నెలకు రూ.4 లక్షలు చెల్లించాలని షమీని ఆదేశించింది.


ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హసీన్ జాహన్ షమీ వ్యక్తిత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 'నీ దురాశ, వ్యక్తిత్వ లేమి, క్రూర మనస్తత్వంతో కుటుంబాన్ని చేజేతులా నాశనం చేశావు. నన్ను చంపించడానికి, మా పరువు తీయడానికి నువ్వు ఎంతో మంది క్రిమినల్స్‌కు డబ్బులు ఇచ్చారు. దీని వల్ల నువ్వు సాధించింది ఏమిటి? క్రిమినల్స్, వేశ్యల కోసం నవ్వు ఖర్చు పెట్టిన డబ్బును మన కోసం, మన పాప కోసం ఖర్చుపెట్టి ఉంటే మన జీవితం ఎంతో బాగుండేది. మనం ఎంతో మర్యాదగా జీవించేవాళ్లం' అంటూ హసీన్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.


'నిజం కోసం, న్యాయం కోసం నేను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నాను. భవిష్యత్తులో కూడా నా పోరాటం కొనసాగుతుంది. నాకు భగవంతుడు ఎంతో ధైర్యం, సహనం ఇచ్చాడు. అందుకే నువ్వు ఎంత మంది క్రిమినల్స్‌తో చేతులు కలిపినా నన్నేం చేయలేకపోయావు. ఈ పురుషాధిక్య సమాజంలో నీకు ఇప్పుడు మద్దతు లభిస్తోంది. కానీ, ఏదో ఒకరోజు నీకు కూడా కష్ట కాలం మొదలవుతుంది. నీవు సన్నిహితులు అనుకుంటున్న వాళ్లే నిన్ను తరిమేస్తారు' అంటూ హసీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్

సంజూ శాంసన్‌కు జాక్‌పాట్

టచ్ చేయలేని రికార్డులు!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 07:02 PM