Women Chess Tournament: టైటిల్ చేరువలో హంపి
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:24 AM
మహిళల చెస్ గ్రాండ్ ప్రీలో హంపి 8వ రౌండ్‌ను డ్రా చేసి టైటిల్ దిశగా ముందంజ వేసింది. హంపి, జు జినర్ ఇద్దరూ 6 పాయింట్లతో టాప్‌లో ఉన్నారు

8వ రౌండ్ డ్రా
పుణె: మహిళల చెస్ గ్రాండ్ ప్రీలో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సంయుక్తంగా టాప్‌లో కొనసాగుతూ టైటిల్‌కు చేరు వైంది. మంగళవారం జరిగిన 8వ రౌండ్‌లో అలీనా కష్లింస్ కయా (పోలెండ్)తో గేమ్‌ను హంపి డ్రా చేసుకొంది. సలోమ్ మెలియా (జార్జియా)తో గేమ్‌ను ద్రోణవల్లి హారిక, సలిమోవా (బల్గేరియా)తో గేమ్‌ను వైశాలి డ్రా చేసుకొన్నారు. కాగా, చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినర్ చేతిలో దివ్యా దేశ్‌ముఖ్ ఓటమిపాలైంది. మొత్తంగా 8 రౌండ్ల నుంచి హంపి, జు జినర్ చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో నిలిచి టైటిల్ కోసం పోటీపడుతున్నారు. దివ్య (5) మూడో స్థానంలో, హారిక (4) ఐదో స్థానంలో ఉన్నారు. టోర్నీలో మరో రౌండ్ మాత్రమే మిగిలి ఉంది.