Chess Rankings: అగ్రస్థానానికి హంపి
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:14 AM
భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీలో అగ్రస్థానంలోకి చేరుకుంది. సోమవారం జరిగిన ఏడో రౌండ్‌లో చైనా జీఎం ఝ జినెర్‌ను ఓడించి 5.5 పాయింట్లతో టాప్ స్థానాన్ని సాధించింది.

ఫిడే: భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీలో అగ్ర స్థానానికి దూసుకొచ్చింది. సోమవారం జరిగిన ఏడో రౌండ్‌లో చైనా జీఎం ఝ జినెర్‌ను 55 ఎత్తుల్లో చిత్తు చేసింది. దాంతో ఝునెర్ (5)ను వెనక్కు నెట్టిన హంపి 5.5 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ద్రోణవల్లి హారిక.. పోలినా షువలోవా (రష్యా)తో పాయింట్‌ను పంచుకుంది. 3.5 పాయింట్లతో హారిక ఐదో స్థానంలో ఉంది. ముంగున్‌తూల్ (మంగోలియా)పై నెగ్గిన దివ్యా దేశ్‌ముఖ్ (5) రెండో స్థానానికి చేరింది.