India vs South Africa ODI: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. కొత్త కెప్టెన్ అతడే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:33 PM
సౌతాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం నూతన కెప్టెన్‌కు ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఈ సిరీస్ కోసం కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్(India vs South Africa ODI) కోసం భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. రోహిత్ శర్మ తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలందుకున్న శుభ్‌మన్ గిల్.. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడనొప్పి కారణంగా ఈ సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో వన్డే సిరీస్ కోసం గిల్ స్థానంలో నూతన సారథిగా కేఎల్ రాహుల్(KL Rahul)కు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ మేనేజ్మెంట్. తొలుత రోహిత్ శర్మకే మరోసారి ఆ ఛాన్స్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ చివరకు రాహుల్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడు. రిషభ్ పంత్(Rishabh Pant) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
అతడికి ఛాన్స్..
సౌతాఫ్రికాతో ప్రస్తుతం రెండో టెస్ట్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సఫారీలో తలపడనుంది. ఈ నెల 30న.. రాంచీ(జార్ఖండ్) వేదికగా తొలి వన్డే, డిసెంబర్ 3న.. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్)లో రెండో వన్డే జరగనుండగా.. డిసెంబర్ 6న జరిగే మూడే వన్డేకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 30న ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం ఇటీవల సఫారీ-ఏ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)ను సెలక్టర్లు ఎన్నుకున్నారు. ఆ ఒక్కటి మినహా పెద్దగా మార్పులేవీ జరగలేదు.
వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్
ఇవీ చదవండి: