Share News

IPL 2025: సన్‌రైజర్స్ రిలాక్సేషన్.. మాల్దీవుల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే

ABN , Publish Date - Apr 28 , 2025 | 08:50 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో డీలా పడింది. అయితే శుక్రవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవగా, సన్‌రైజర్స్ అవకాశాలు మాత్రం ఇంకా సజీవంగా ఉన్నాయి.

IPL 2025: సన్‌రైజర్స్ రిలాక్సేషన్.. మాల్దీవుల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే
Sun Risers Hyderabad Team

గత సీజన్‌లో అద్భుతంగా రాణించి ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ఈ ఏడాది మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది (IPL 2025). వరుస పరాజయాలతో డీలా పడింది. అయితే శుక్రవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవగా, సన్‌రైజర్స్ అవకాశాలు మాత్రం ఇంకా సజీవంగా ఉన్నాయి.


టోర్నీ ఒత్తిడిని పక్కన పెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సేద తీరేందుకు మాల్దీవులకు వెళ్లారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన తర్వాతి మ్యాచ్‌కు ముందు దాదాపు వారం రోజుల పాటు విశ్రాంతి దొరికింది. దీంతో సన్‌రైజర్స్ టీమ్ మాల్దీవులకు బయల్దేరింది. అక్కడ రిసార్ట్‌లో ఒక్కొక్కరూ ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వాలీబాల్ ఆడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇక, ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు లీగ్ దశలో 8 విజయాలు సాధించినట్లయితే 16 పాయింట్లు లభిస్తాయి. దాంతో టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. అయితే అది ఇతర జట్ల విజయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 28 , 2025 | 08:50 PM