Share News

IPL 2025 RR vs GT: టాస్ గెలిచిన రాజస్తాన్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Apr 28 , 2025 | 07:07 PM

ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది.

IPL 2025 RR vs GT: టాస్ గెలిచిన రాజస్తాన్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
GT vs RR

తాజా ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడబోతోంది (GT vs RR). ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. అయితే ఒక్కరోజులోనే టాప్ ప్లేస్‌కు తిరిగి చేరుకునే అవకాశం గుజరాత్ ముందుంది.


తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే గుజరాత్ సునాయాసంగా ప్లే ఆఫ్స్‌కు చేరిపోతుంది. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ పరుగుల వేటలోనూ, ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ల వేటలోనూ దూసుకుపోతున్నారు. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ముఖ్యంగా గత మూడు మ్యాచ్‌ల్లోనూ విజయానికి చేరువలోకి వచ్చి పరాజయం పాలైంది.


తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయిర్, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగ, మహీష తీక్షణ, శుభం దూబె, సందీప్ శర్మ.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 28 , 2025 | 07:07 PM