IPL 2025 RR vs GT: చితక్కొట్టిన గిల్, బట్లర్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:17 PM
ఐపీఎల్‌లో వరుస గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. పిచ్ ఏదైనా పరుగుల వరద పారిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గుజరాత్ భారీ స్కోరు సాధించింది.

ఐపీఎల్‌లో వరుస గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. పిచ్ ఏదైనా పరుగుల వరద పారిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది (GT vs RR). ఈ మ్యాచ్‌లో కూడా గుజరాత్ భారీ స్కోరు సాధించింది. శుభ్‌మన్ గిల్ (84) మరో అద్భుత ఇన్నింగ్స్‌తో రెచ్చిపోవడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పరాగ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయారు. శుభ్‌మన్ గిల్‌తో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (39) తన ఫామ్‌ను కొనసాగించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. సుదర్శన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన జాస్ బట్లర్ (50) కూడా బౌండరీలతో ఆర్‌ఆర్ బౌలర్లను బెంబేలెత్తించాడు. సెంచరీకి చేరువవుతున్న సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి గిల్ అవుటయ్యాడు. దీంతో జీటీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
రాజస్తాన్ రాయల్స్ ముందు 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. రాజస్తాన్ బౌలర్లలో తీక్షణ రెండు వికెట్లు తీశాడు. సందీప్, ఆర్చర్ ఒక్కో వికెట్ తీశారు. మరి, ఈ భారీ టార్గెట్‌ను రాజస్తాన్ బ్యాటర్లు ఎలా ఛేజ్ చేస్తారో చూడాలి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. అయితే ఒక్కరోజులోనే టాప్ ప్లేస్‌కు తిరిగి చేరుకునే అవకాశం గుజరాత్ ముందుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..