Share News

IPL 2025 DC vs KKR: ఢిల్లీలో కీలక పోరు.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేద్దామా

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:41 PM

ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి తెర లేవబోతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలని ఒకరు, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని మరొకరు ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది

IPL 2025 DC vs KKR: ఢిల్లీలో కీలక పోరు.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేద్దామా
DC vs KKR

ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి తెర లేవబోతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలని ఒకరు, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని మరొకరు ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది (KKR VS DC). ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ కేకేఆర్ గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. (IPL 2025)

kkr.jpg


ఢిల్లీ జట్టుకు డుప్లెసిస్ రావడం కొండంత బలాన్ని అందిస్తోంది. డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ ఓపెనింగ్ భాగస్వామ్యం కీలకం కానుంది. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ చక్కని ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా కీలక పరుగులు చేస్తున్నాడు. కరుణ్ నాయర్, క్రిస్టన్ స్టబ్స్ కూడా అవసరమైనప్పుడు పరుగులు చేస్తున్నారు. ఇక, బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్లు ఉన్నారు. గత మ్యాచ్‌లో కోహ్లీ వికెట్ తీయడమే కాకుండా పరుగులు కూడా నియంత్రించిన దుష్మంత చమీరా ఈ మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


మరోవైపు కోల్‌కతా బ్యాటింగ్ విభాగం తడబడుతోంది. ఓపెనర్లు డికాక్, నరైన్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. డికాక్‌ను పక్కన పెట్టి అతడి స్థానంలో తీసుకొచ్చిన గుర్భాజ్ కూడా ఇప్పటివరకు పెద్దగా పరుగులు చేయలేదు. అజింక్య రహానే మాత్రమే ఫామ్‌లో కనబడుతున్నాడు. వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్ ఫామ్ లేమితో సతమతమవుతున్నారు.


బౌలింగ్‌లో మాత్రం కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తోంది. నరైన్, వెంకటేష్ అయ్యార్, వైభవ్ అరోరా ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. కేకేఆర్ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ టీమ్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.


తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (అంచనా): అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా

కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా): గుర్భాజ్, సునీల్ నరైన్, అజింక్య రహానే, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, వైభవ్ అరోరా, రో‌వ్‌మెన్ పావెల్, సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 05:41 PM