IPL 2025 DC vs KKR: టార్గెట్ సెకెండ్ ప్లేస్.. కోల్‌కతాతో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:12 PM
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. పడుతూ, లేస్తూ ముందుకు వెళ్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన డీసీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఈ ఐపీఎల్ సీజన్‌ను (IPL 2025) అద్భుతంగా ప్రారంభించింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. పడుతూ, లేస్తూ ముందుకు వెళ్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన డీసీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడబోతోంది (KKR VS DC). ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది.
ఇక, అజింక్య రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఈ సీజన్‌లో మంచి ఆరంభాన్ని అందుకుంది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి, మరో మూడు ఓడిపోయింది. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ఆ జట్టును తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ఆ మ్యాచ్‌లో కేవలం 111 పరుగులను ఛేదించలేక కేకేఆర్ చతికిలపడింది. ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ తర్వాతి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతానికి 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ రోజు డీసీతో జరగబోయే మ్యాచ్‌లో గెలవలేకపోతే కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టతరమవుతాయి.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. అందులో కేకేఆర్ 18 విజయాలు సాధించగా, ఢిల్లీ 14 సార్లు గెలుపొందింది. ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. ఇక, ఈ రోజు మ్యాచ్ జరగబోయే ఢిల్లీ మైదానంలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 10 సార్లు తలపడ్డాయి. అందుల్లో కేకేఆర్ ఐదు సార్లు, ఢిల్లీ నాలుగు సార్లు గెలిచాయి. ఓ మ్యాచ్ టై అయింది.
ప్రస్తుత ఆటతీరును బట్టి చూస్తే కోల్‌కతాపై ఢిల్లీదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే టీ-20 మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. కేకేఆర్ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ టీమ్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..