IPL 2025 DC vs KKR: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - Apr 29 , 2025 | 07:03 PM
ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంటుంది.

ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది (KKR VS DC). ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ కేకేఆర్ గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. కేకేఆర్ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ టీమ్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతానికి 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ రోజు డీసీతో జరగబోయే మ్యాచ్‌లో గెలవలేకపోతే కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టతరమవుతాయి.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా
కోల్‌కతా నైట్ రైడర్స్: గుర్భాజ్, సునీల్ నరైన్, అజింక్య రహానే, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, వైభవ్ అరోరా, అనుకూల్ రాయ్, సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..