Women Cricketers: ఆ ముగ్గురు మహిళా క్రికెటర్లకు.. రైల్వే శాఖ బంపర్ ఆఫర్..
ABN , Publish Date - Dec 01 , 2025 | 09:47 PM
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(ఆర్ఎస్‌పీబీ) ముగ్గురు మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతికా రావల్, స్నేహా రానా, రేణుకా సింగ్ ఠాకూర్‌లను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమించింది.
2025 ఐసీసీ ఉమెన్స్ ఓడీ వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(ఆర్ఎస్‌పీబీ) ముగ్గురు మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతికా రావల్, స్నేహా రానా, రేణుకా సింగ్ ఠాకూర్‌లను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమించింది. ఈ ముగ్గురు క్రికెటర్లు గ్రూప్ బీ గెజిటెడ్ ఆఫీసర్‌లతో సమానమైన జీతాన్ని, బెనిఫిట్స్‌ను పొందనున్నారు. వరల్డ్ కప్‌లో అత్యాద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు గానూ ఆర్ఎస్‌పీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, సెమీ ఫైనల్స్‌కు ముందు ప్రతికా రావల్ గాయానికి గురైంది. దీంతో టోర్నమెంట్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలో షెఫాలీ వర్మను రీప్లేచ్ చేశారు. స్నేహ రానా బౌలింగ్ ఆల్ రౌండర్‌గా తన సత్తా చాటారు. రేణుకా సింగ్ తన బౌలింగ్‌తో భారత్ కప్పు గెలవడానికి తన వంతు కృషి చేశారు. నవంబర్ 2వ తేదీన జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి
బెంగాల్‌లో ఎస్ఐఆర్ సెగలు.. బీఎల్ఓల ఆందోళన ఉధృతం
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 49 సెకెన్లలో కనిపెట్టండి