Telugu Athletes in Athletics: ఆసియా అథ్లెటిక్స్
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:22 AM
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ కోసం భారత జట్టులో ముగ్గురు తెలుగు అథ్లెట్లు చోటు పొందారు. నిత్య గంధే, జ్యోతి యర్రాజీ, నందిని అగసార ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్నారు

భారత జట్టులో ముగ్గురు తెలుగోళ్లు
న్యూఢిల్లీ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 59 మంది బృందంలో ముగ్గురు తెలుగు అథ్లెట్లకు చోటు లభించింది. వచ్చేనెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలోని గుమిలో పోటీలు జరగనున్నాయి. అయితే పలు అంతర్జాతీయ పోటీలపై దృష్టి సారించడంతో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ పోటీల్లో పాల్గొనడంలేదు. తెలుగు అథ్లెట్లలో నిత్య గంధే (200 మీ. పరుగు, 4్ఠ100 మీ. రిలే), జ్యోతి యర్రాజీ (100 మీ. హర్డిల్స్), నందిని అగసార (హెప్టాథ్లాన్) పోటీపడనున్నారు. అవినాష్ సబ్లే (3వేల మీ. స్టీపుల్ చేజ్), తేజస్వినీ శంకర్ (డెకాథ్లాన్), ప్రవీణ్ చిత్రవేల్, అబూబాకర్ (ట్రిపుల్ జంప్), అన్నూరాణి (జావెలిన్‌త్రో), పారుల్ చౌధురి (3వేల మీ. స్టీపుల్ చేజ్, 5వేల మీ. పరుగు) తదితర స్టార్లు జట్టులో ఉన్నారు.