Share News

Ved Krishna Murthy Retirement: వేద కృష్ణమూర్తి వీడ్కోలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:02 AM

భారత మహిళల జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ వేద కృష్ణ మూర్తి క్రికెట్‌కు వీడ్కోలు పలికింది...

Ved Krishna Murthy Retirement: వేద కృష్ణమూర్తి వీడ్కోలు

న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ వేద కృష్ణ మూర్తి క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2017 వన్డే వరల్డ్‌కప్‌, 2020 టీ20 వరల్డ్‌కప్‌ల్లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో వేద సభ్యురాలు. కర్ణాటకలోని కడురు అనే చిన్న పట్టణం నుంచి భారత జట్టు జెర్సీని ధరించే స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉందని 32 ఏళ్ల వేద పేర్కొంది. 2011లో అరంగేట్రం చేసిన వేద.. భారత్‌ తరఫున ఐదేళ్ల క్రితమే చివరి మ్యాచ్‌ ఆడింది. మొత్తంగా తన కెరీర్‌లో 48 వన్డేల్లో 829, 76 టీ20ల్లో 875 రన్స్‌ సాధించింది.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 02:02 AM