Rajeev Shukla Statement: పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోం
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:17 AM
పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఏ పరిస్థితుల్లోనూ జరగవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు

న్యూఢిల్లీ: ఉగ్ర దేశం పాకిస్థాన్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మరోసారి ఉద్ఘాటించాడు. పహల్గాంలో పర్యాటకుల ఊచకోత నేపథ్యంలో శుక్లా తీవ్రంగా స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటామన్నాడు. 2012-13 తర్వాత పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీ్‌సలు ఆడడంలేదు. ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఇరుజట్లూ తలపడుతున్నాయి.