Share News

Ind vs Pak: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. భారత్-పాక్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్!

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:35 PM

భారత్-పాక్ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీల ద్వారా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.

Ind vs Pak: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. భారత్-పాక్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్!
Megastar chiranjeevi in dubai stadium

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీల ద్వారా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. చిరంజీవి పెవిలియన్‌లో కూర్చుని ఆసక్తిగా మ్యాచ్ వీక్షిస్తూ టీవీ స్క్రీన్‌పై పలుసార్లు కనిపించారు.


మరోవైపు మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ, నటుడు సన్నీ డియోల్ కలిసి టీవీలో మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. కాగా, టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్లో పిచ్‌పై పాకిస్తాన్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడుతున్నారు. కాస్త దూకుడు పెంచి బౌండరీలు కొడుతున్న పాక్ ఓపెనర్ బాబర్ అజామ్ (23)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (25 బంతుల్లో 10) రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం 25 ఓవర్లలో పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది (Champions Trophy).


ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్ (53 బంతుల్లో 24), షౌద్ షకీల్ (47 బంతుల్లో 29) క్రీజులో ఉన్నారు. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, టీమిండియా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమ్‌తోనే మార్పులేమీ లేకుండా బరిలోకి దిగింది. పాకిస్తాన్ మాత్రం గత మ్యాచ్‌తో పోల్చుకుంటే ఓ మార్పుతో బరిలోకి దిగింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 04:36 PM