Ind vs Eng: సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్.. లంచ్ సమయానికి టీమిండియా 248/4
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:51 PM
లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా దీటుగా స్పందిస్తోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (98 నాటౌట్), రిషభ్ పంత్ (74) కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా మంచి స్థితిలో నిలిచింది.

లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా దీటుగా స్పందిస్తోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో (Ind vs Eng) కేఎల్ రాహుల్ (171 బంతుల్లో 98 నాటౌట్), రిషభ్ పంత్ (112 బంతుల్లో 74) కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా మంచి స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. జో రూట్ (104) సెంచరీ చేశాడు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 107 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కేఎల్ రాహుల్ (KL Rahul), రిషభ్ పంత్ (Rishabh Pant) నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. మరో సెంచరీ చేసేలా కనిపించిన రిషభ్ పంత్ లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుకు మరో 139 పరుగులు వెనుకబడి ఉంది.
ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి బ్యాటర్లు క్రీజులోకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి మ్యాచ్‌పై పట్టు బిగించాలని టీమిండియా కృత నిశ్చయంతో ఉంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ ఒక్కో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ప్రస్తుత టెస్ట్ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్తుంది.
ఇవీ చదవండి:
టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి