Share News

IND vs AUS: టాస్ మళ్లీ ఆస్ట్రేలియాదే.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Oct 25 , 2025 | 09:10 AM

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు సిడ్నీలో చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలని కృతినిశ్చయంతో ఉంది.

IND vs AUS: టాస్ మళ్లీ ఆస్ట్రేలియాదే.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
India vs Australia 2025

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు సిడ్నీలో చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలని కృతినిశ్చయంతో ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఈ మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిడ్నీలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది (India vs Australia 2025).


ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు (IND vs AUS toss). ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా టీమిండియా కెప్టెన్ గిల్ టాస్ గెలవలేదు. మొదటి మ్యాచ్ ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. తొలి రెండు వన్డేల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అర్ష్‌దీప్ సింగ్‌, నితీష్ కుమార్ రెడ్డిలను పక్కన పెట్టారు. వారి స్థానంలో కుల్దీప్ యాదవ్‌, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు కల్పించారు.


తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, సిరాజ్, కుల్దీప్ యాదవ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ట్, అలెక్స్ క్యారీ, మ్యాట్ రెన్‌షా, కూపర్ కానోలి, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జోష్ హాజెల్‌వుడ్


ఇవి కూడా చదవండి..

IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

Virat Kohli Emotional: అడిలైడ్‌ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ

Updated Date - Oct 25 , 2025 | 09:10 AM