Humpy Koneru: క్వార్టర్స్‌లో హంపి, హారిక
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:05 AM
భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్ బాబు, దివ్యా దేశ్‌ముఖ్

వైశాలి, దివ్య కూడా..మహిళల చెస్ ప్రపంచ కప్
బటూమి (జార్జియా): భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్ బాబు, దివ్యా దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్‌లో పతకం సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఈ నలుగురు క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. కాగా, ఒకే దేశానికి చెందిన నలుగురు క్రీడాకారిణులు క్వార్టర్స్ చేరడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. శుక్రవారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్ టైబ్రేకర్లలో అలెగ్జాండ్రా కొస్టెన్యూక్ (స్విట్జర్లాండ్)ని హంపి, రష్యా గ్రాండ్‌మాస్టర్ క్యాటరీనా లగ్నోని హారిక ఓడించారు. ఇక.. కమలిదెనోవా (కజకి స్థాన్)పై వైశాలి, చైనాకు చెందిన రెండో సీడ్ జు ఝినెర్‌పై దివ్య విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి