Share News

Women Chess World Cup: చెక్‌ చెప్పేదెవరో

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:41 AM

విశ్వ చెస్‌లో భారత్‌ ఆధిపత్యానికి తాజా నిదర్శనం..మహిళల వరల్డ్‌ కప్‌ ఫైనల్‌...

Women Chess World Cup: చెక్‌ చెప్పేదెవరో

  • నేటి నుంచి మహిళల చెస్‌ ప్రపంచ కప్‌ఫైనల్‌

బటూమి (జార్జియా): విశ్వ చెస్‌లో భారత్‌ ఆధిపత్యానికి తాజా నిదర్శనం..మహిళల వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. శనివారం ఆరంభమయ్యే రెండు రోజుల తుదిపోరులో భారత్‌కుచెందిన కోనేరు హంపి, దివ్యా దేశ్‌ముఖ్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. 38 ఏళ్ల హంపి డిఫెండింగ్‌ వరల్డ్‌ ర్యాపిడ్‌ చాంపియన్‌ కాగా, 19 ఏళ్ల దివ్య వర్ధమాన సంచలనం. వరల్డ్‌ నెం. 5 హంపి, 18వ ర్యాంకర్‌ దివ్యా దేశ్‌ముఖ్‌ సెమీఫైనల్స్‌లో చైనా స్టార్లకు షాకివ్వడం విశేషం. ప్రపంచ కప్‌లో ఇద్దరు భారత క్రీడాకారిణులు ఫైనల్‌కు చేరడం చరిత్ర. టైటిల్‌ ఫైట్‌కు చేరడం ద్వారా గ్రాండ్‌మాస్టర్‌ హంపి, ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ దివ్య ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌కు క్వాలిఫై అయ్యారు. క్యాండిడేట్స్‌ టోర్నీ ద్వారా ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌తో టైటిల్‌కోసం తలపడే క్రీడాకారిణిని నిర్ణయిస్తారు. ఇక..వరల్డ్‌ కప్‌ ఫైనల్లో శనివారం జరిగే క్లాసికల్‌ ఫార్మాట్‌ మొదటి గేమ్‌లో హంపి, దివ్య తలపడతారు. ఇరువురి మధ్య ఆదివారం రెండో గేమ్‌ జరగనుంది. ఒకవేళ రెండు గేముల్లో విజేత తేలకపోతే..సోమవారం టైబ్రేకర్‌ నిర్వహిస్తారు. మరి ఈ ఆసక్తికర అంతిమ సమరంలో అనుభవజ్ఞురాలైన హంపి విజేతగా నిలుస్తుందా లేక దివ్య సంచలనం సృష్టిస్తుందా? ఎవరు నెగ్గినా వరల్డ్‌ కప్‌లో స్వర్ణ, రజత పతకాలు భారత్‌కే దక్కనున్నాయి.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 01:41 AM