Share News

Sunil Gavaskar: ఇక ఆ పదాన్ని మర్చిపోండి

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:56 AM

భారత క్రికెట్‌లో ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్‌

Sunil Gavaskar: ఇక ఆ పదాన్ని మర్చిపోండి

లండన్‌: భారత క్రికెట్‌లో ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్‌ పేసర్‌ బుమ్రా ఐదు టెస్టుల సిరీ్‌సలో మూడింటికే పరిమితమయ్యాడు. అయితే ఇదంతా అపోహేనని సిరాజ్‌ నిరూపించాడని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ హైదరాబాదీ మొత్తం ఐదు మ్యాచ్‌లనూ ఆడిన సంగతి తెలిసిందే. ‘వర్క్‌లోడ్‌ను దరి చేరనీయకుండా సిరాజ్‌ బౌలింగ్‌ వేసిన తీరు అద్భుతం. కెప్టెన్‌ ఎప్పుడు బంతి ఇచ్చినా సుదీర్ఘ స్పెల్‌లు వేశాడు. ఇక భారత జట్టు ఆ పదాన్ని తమ డిక్షనరీ నుంచి తొలగించాలి. ఎందుకంటే వర్క్‌లోడ్‌కు కట్టుబడితే అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దించలేం. మానసికంగా దృఢంగా ఉండడమే ముఖ్యం. అలాగే పంత్‌ గాయమైనా బ్యాటింగ్‌కు దిగాడు. సైనికులు తమకెదురయ్యే కఠిన పరిస్థితులపై ఫిర్యాదు చేస్తారా?’ అని సన్నీ ప్రశ్నించాడు.

Updated Date - Aug 06 , 2025 | 01:56 AM